ఆదిలాబాద్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్థన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జనార్థన్కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.
మంగళవారం (నవంబర్ 5) తెల్లవారుఝామున డ్యూటీకి వెళ్తుండగా కాపు కాచిన కొందరు వ్యక్తులు జనార్థన్ పై దాడికి దిగారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటా హుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని..సదరు వ్యక్తులను గుర్తించే పనిలో పడ్డారు.
ఆర్టీసీ కార్మికులు సమ్మె క్రమంలో ప్రభుత్వం ప్రైవేటు..డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను నడిపిస్తోంది. డ్రైవర్లను డ్యూటీలోకి తీసుకునే విషయంలో డిపో మేనేజన్ అవకతవకలకు పాల్పడ్డారనీ..జనార్థన్ రెడ్డి వారి నుంచి భారీగా డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.ఈ క్రమంలో మేనేజర్ పై దాడికి పాల్పడినవారు ఎవరు? అనే విషయంపై పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.