ఏపీకి మూడు రాజధానులు ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటనతో రాష్ట్రంలో తీవ్రమైన అలజడి సృష్టిస్తోంది. ఈ అంశంపై గుడివాడ Ycp ఎమ్మెల్యే అమర్నాథ్ మాట్లాడుతూ..ఏపీకి మూడు రాజధానులు ఉంటే ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా విశాఖపట్నం ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ది జరగుతుందని ఇది చాలా మంచి నిర్ణయమని 10టీవీతో అమర్నాత్ అన్నారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం అన్ని రకాలుగా అనుకూలమైన ప్రాంతమని అన్నారు. విశాఖకు దేశంలో ఎక్కడి నుంచైనా రోడ్డు, రైల్వే, విమానయానాల ఫెసిలిటీ ఉంది కాబట్టి ట్రాన్సపోర్టేషన్ కూడా సులువుగా ఉంటుందన్నారు. పైగా విశాఖలో రాజధాని పెట్టటానికి ఆర్థికంగా ఎటువంటి భారంకాదన్నారు.
ఈ విషయంలో ప్రతిపక్ష నాయకులు అనవసరంగా పెద్దది చేస్తున్నారనీ..రాజకీయ లబ్ది కోసమే ఇటువంటి విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసిన స్ర్కిప్ట్ చదువుతున్నారు తప్ప సొంత ఆలోచన మాత్రం లేదని ఎద్దేవా చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్ గా కర్నూలు, లెజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి ఉండొచ్చు అంటూ సీఎం జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి.