తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి!

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మరో స్కామ్‌పై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేశారు. తాజా ట్వీట్‌లో గంటా శ్రీనివాసరావుపై సెటైర్ వేస్తూ.. టీడీపీ హ‌యాంలో సైకిళ్లు, సుత్తులు, కొడ‌వ‌ళ్లు పంచ‌డం రివాజు. వాటిల్లో కూడా స్కామ్ ఆరోప‌ణ‌లు ఉండటం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ క్ర‌మంలో ఈ అంశం తెర‌మీద‌కు రావ‌డంతో మరో టీడీపీ నాయకుడిపై చవాక్కులు పేల్చారు విజయసాయి.

వైఎస్సార్ కాంగ్రస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కామెంట్ చేశారు. సైకిళ్ల కుంభకోణంలో అప్పటి మంత్రి గంటా శ్రీనివాసరావుపై పరోక్షంగా ఈ ఆరోపణలు చేశారు…ట్విటర్ లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి.

‘తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!’

12 కోట్ల రూపాయ‌ల కొనుగోళ్ల‌లో రూ.5కోట్ల అవినీతి అని ఆయ‌న పేర్కొన్నారు. ESIస్కామ్‌లో కూడా బ్లాక్ లిస్టులోని కంపెనీల నుంచి కొనుగోళ్ల అంశ‌మే హైలెట్ అవుతోంది. ఇలాంటి క్ర‌మంలో సైకిళ్ల స్కామ్ లో కూడా మ‌ళ్లీ అలాంటి అంశ‌మే వార్త‌ల్లోకి రావ‌డం గ‌మ‌నార్హం. ఈ సైకిళ్ల స్కామ్ ఎంత వ‌ర‌కూ వెళ్తుందో? మ‌రో మాజీ మంత్రి కూడా ఊచల వెనుకకు వెళ్లాల్సిందేనా.. అనే దానిపై చర్చ నడుస్తోంది.