ఉద్యోగం సాధించలేకపోయావ్..సిగ్గులేదంటూ ఉమ్మివేసి..భార్యా..4ఏళ్ల కూతురికి తండ్రి చిత్రహింసలు

  • Publish Date - September 26, 2020 / 04:05 PM IST

భార్య ఉద్యోగం తెచ్చుకోలేదని కన్నకూతుర్ని చిత్రహింసలు పెడుతున్నాడో కసాయి తండ్రి. భార్యపై కోపాన్ని కూతురిపై చూపుతూ..ఆ చిన్నారి ముఖంపై ఉమ్మి వేసి చితక్కొడుతున్న ఘటన తెలంగాణలోని వికారాబాద్‌ జిల్లాలో జరిగిది.
బస్ కండక్టర్‌గా పనిచేస్తున్న అజీముద్ధీన్‌కు భార్య ఇద్దరు కూతుళ్లు. భార్య ఉద్యోగం చేయాలని రోజు గొడవ చేయటం ఆమెను వేధిస్తుండేవాడు. ప్రతీరోజు తాగి వచ్చి భార్యను చితకబాదేవాడు. ఇద్దరు ఆడపిల్లలు తండ్రి ఇంటికి వస్తున్నాడంటే చాలు హడలిపోయేవారు.




ప్రతీరోజులాగానే తాగి ఇంటికి తూలుకుంటూ వచ్చిన అజీముద్దీన్ భార్యను చితకబాదాడు. దెబ్బలు తాళలేక ఆమె ఇంట్లో నుంచి పారిపోవాలని ప్రయత్నించటంతో మరింతగా రెచ్చిపోయాడు. చేతికి అందిన నాలుగేళ్ల చిన్న కూతురుని పట్టుకుని దారుణంగా కొట్టాడు. ఆ చిన్నారి ముఖంపై ఉమ్మి వేసి ‘‘మీకు మీ అమ్మకు సిగ్గులేదు..నేను సంపాదిస్తుంటే కూర్చుని బాగా తింటున్నారంటూ’’ కొట్టాడు.

కూతుర్ని కొడుతుంటే భార్య అడ్డం వెళ్లగా ఆమెను తోసిపడేశాడు. చిన్న కూతుర్ని కొడుతుంటే భార్య వీడియో తీసింది. ఆ వీడియోను తన అత్తా మామలకు చూపెట్టింది. దానికి వాళ్లు భర్త కొడుతుంటాడు..తిడుతుంటాడు..ఈ మాత్రందానికి వీధిన పడి అల్లరి చేయాలా? ఇంట్లోనే అన్నీ భరించాలి వీధిన పెట్టుకోకూడదు‘‘అంటూ నీతులు చెప్పేసరికి తన గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలీక వేరే దారి లేక ఆమె పోలీసులను ఆశ్రయించింది.




దీంతో పోలీసులు అజీముద్దీన్‌ను అరెస్ట్ చేశారు. తల్లి ఇద్దరకు కూతుళ్లను ప్రభుత్వ ఆధర్వ్యంలోని సఖి కేంద్రానికి పంపించారు. కాగా..ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారనే దుగ్థ కడుపులో పెట్టుకుని ఇలా ప్రవర్తిస్తున్నాడని పోలీస్ విచారణలో తేలింది.

అజీముద్దీన్ కు 2014లో వివాహం అయింది. పెళ్లినాటికే ఆమె టీచర్ ట్రైనింగ్ కోర్స్ పూర్తి చేసింది. దీంతో ఉద్యోగం చేస్తుందనే ఆశతో అజీముద్దీన్ పెళ్లి చేసుకున్నాడు. అయితే ఆమెకు ఉద్యోగం రాలేదు. దీంతో ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నాడని పోలీస్ విచారణలో తేలింది.