పరుగుల యంత్రం.. రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. కొన్ని సీజన్లుగా అద్భుతమైన ఫామ్ లో కనిపిస్తోన్న కోహ్లీ.. ఐపీఎల్ లో అత్యధిక పరుగులు బాదిన రెండో ప్లేయర్ గానే కాకుండా 5వేల పరుగులు కొట్టేసిన రెండో క్రికెటర్ గా నిలిచాడు.
ఈ క్రమంలో కోహ్లీ చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో (46; 32 బంతుల్లో 6 ఫోర్లు)పరుగులు చేశాడు. 2016లో కోహ్లీ 4 సెంచరీలతో 973పరుగులు సాధించాడు. ఆ సీజన్ లో ఫైనల్ వరకూ వెళ్లిన బెంగళూరు సన్‌రైజర్స్ చేతిలో ఓడిపోయింది. 2019సీజన్‌కు కోహ్లీ ఖాతాలో 4948ఐపీఎల్ పరుగులు ఉన్నాయి.
ఈ 5వేల పరుగులను చేరుకోవడానికి సురేశ్ రైనా తీసుకున్న ఇన్నింగ్స్ ల కంటే తక్కువ సమయంలో కోహ్లీ పూర్తి చేయగలిగాడు. రైనాకు 177 మ్యాచ్‌లలో 173 ఇన్నింగ్స్ లు ఆడితే కోహ్లీ 165 మ్యాచ్‌లలో 157 ఇన్నింగ్స్ ఆడి బాదేశాడు.
5⃣0⃣0⃣0⃣ #VIVOIPL runs for @imVkohli !
The only batsman to have scored all of them for @RCBTweets ? #RCBvMI pic.twitter.com/8nHriCnpVm
— IndianPremierLeague (@IPL) March 28, 2019