వైజాగ్ రూరల్ పోలీసులు 63వేల 879కేజీల గంజాయిని ధ్వంసం చేశారు. కాపులప్పాడ డంపింగ్ యార్ట్‌లో పెద్ద మొత్తంలో అంటే దాదాపు రూ.13కోట్ల విలువైన గంజాయిని కాల్చేశారు. జిల్లాలో దొరికిన గంజాయి నిల్వల్లో భారీ మొత్తంలో ఇది నాల్గోది. డీఐజీ ఎల్కేవీ రంగారావు మీడియా అధికారులతో మాట్లాడుతూ.. 13పోలీస్ స్టేషన్లలో 455కేసులు నమోదయ్యాయి.
‘ఈ దాడుల్లో దొరికిన గంజాయిని పోలీస్ స్టేషన్లలో ఉంచుతున్నాం. ఓ సారి కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన తర్వాత దానిని నాశనం చేస్తాం’ అని ఆయన తెలిపారు. ఈ 455కేసుల్లో జీ మాడుగులలో 91, పాడేరులో 89, రోలుగుంటలో 69, ముంచింగ్‌పుట్.. హుకుంపేటలో 22, కొత్తకోట.. అనంతగిరిలో 39, రావికమటంలో 30, పెదబాయల్లో 16, కాసీంకోటలో 19, సబ్బవరంలో 10కేసులు నమోదయ్యాయి.
వైజాగ్ రూరల్ ఎస్పీ బాబుజీ అట్టాడ, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ డిప్యూటీ కమిషనర్ టీ శ్రీనివారాసరావులు తనిఖీలు నిర్వహించి పలు కేసులు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు బట్టి ఫిబ్రవరి 27న రూరల్ పోలీసులు 11వేల 493కేజీలు, మార్చి 13న 7వేల 637కేజీలు, సెప్టెంబర్ 3న 43వేల 341కేజీలు నాశనం చేసినట్లు అధికారులు వెల్లడించారు.