విశాఖలో అదృశ్యమైన ముగ్గురు యువతులు చెన్నైలో ప్రత్యక్ష్యం!!

  • Publish Date - February 18, 2020 / 10:32 AM IST

విశాఖపట్నం ద్వారకా నగర్ లో అదృశ్యమైన ముగ్గురు యువతులు చెన్నైలో ప్రత్యక్షమయ్యారు. తాము చెన్నైలో ఉన్నామని తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు చెన్నై వెళ్లి వారిని తీసుకొచ్చేందుకు పయనమయ్యారు. 

వివరాల్లోకి వెళితే..ద్వారకానగర్‌లో సాయిసదన్ అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ ఎర్రంనాయుడు కుమార్తెలు  నింది అనూరాధ (22) నింది తులసి (20) నింది కోమలి (17) సోమవారం (ఫిబ్రవరి 17,2020) రాత్రి ఇంట్లోంచి వెళ్లి..తరువాత మేం చనిపోతున్నాం..అమ్మా..మాకోసం వెతకొద్దు..మీకు ఆర్థికంగా భారంగ కాకూడదని ఇంట్లోంచి వచ్చేశాం..అంటూ తల్లికి టెక్ట్స్ మెజేస్ చేసి అదృశ్యమయ్యారు. 

దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు ద్వారకానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారి కోసం గాలింపు చేపట్టారు. దీంట్లో భాగంగా పోలీసులు యువతుల వద్ద ఉన్న ఫోన్ నంబర్ కు ఫోన్ చేశారు. కానీ అది స్విచ్ఛాఫ్ వచ్చింది. ఈ క్రమంలో మరోసారి గా ముగ్గురు యువతులు తాము చెన్నైలో క్షేమంగా ఉన్నామని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పారు.  దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఈ విషయం చెప్పారు. దీంతో పోలీసులు ఏ నంబర్ నుంచి కాల్ వచ్చిందో ఆ నంబర్ ను ట్రేస్ అవుట్ చేయటంతో చెన్నైలోని ఓ ప్రాంతంలో యువతులు ముగ్గురు ఉన్నట్లుగా తెలిసింది. 

దీంతో వెంటనే ద్వారకానగర్ పోలీసులు చెన్నైలోని సమీప పోలీసులకు సమాచారం అందించారు. యువతుల ముగ్గురిని పీఎస్ వద్దకు చేర్చి జాగ్రత్తగా ఉంచమని మేము వచ్చివారిని తీసుకెళతామని సూచించారు.   యువతులు ముగ్గురు క్షేమంగా ఉన్నారని తెలిసి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తంచేస్తుండగా పోలీసులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. వారిని చెన్నైనుంచి తీసుకురావటానికి పోలీసులు విశాఖ నుంచి చెన్నైకు పయనమయ్యారు. కాగా ముగ్గురు ఆడపిల్లలతో వాచ్ మెన్ గా పనిచేసే ఎర్రంనాయుడు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడనీ..వారి చదువులు ఇతర అవరసరాలతో పాటు రానున్న కాలంలో వారి వివాహాల విషయంలో కూడా తండ్రికి భారం కాకూడదనే ఆలోచించిన వారి పిల్లలు అనురాధ, తులసి, కోమలిలు ఇంటినుంచి దూరంగా వెళ్లిపోయి చనిపోదామని అనుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇంటినుంచైతే వెళ్లారుగానీ తల్లీ తండ్రీ తాము కనిపించక అల్లాడిపోతుంటారని గుర్తుకొచ్చిన ఆ చిట్టితల్లులు  మనస్సు  ఉండబట్టలేక  అమ్మానాన్నలతో మరోసారి మాట్లాడాలనుకున్నారు. అప్పటికే వారు అదృశ్యం కావటంతో తల్లడిల్లిపోతున్న వారు పోలీసులకు ఫోన్ చేయటం..వారు చెన్నైలో క్షేమంగా ఉన్నట్లుగా తెలియటంతో ముగ్గురు యువతుల మిస్సింగ్ మిస్టరీ వీడిపోయింది.