ఓటర్ల జాబితా పరిశీలన గడువు పెంపు

  • Publish Date - October 17, 2019 / 03:56 AM IST

ఓటర్ల జాబితా పరిశీలన గడువును (నవంబర్ 18, 2019)వరకు పెంచుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నట్టు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌ తెలిపారు. ఈమేరకు బుధవారం (అక్టోబర్ 16, 2019) ఒక ప్రకటనలో వెల్లడించారు.

పేర్లు, చిరునామాలో తప్పుల సవరణకు ఈ గడువిచ్చిందని చెప్పారు. నవంబరు 25 నుంచి డిసెంబరు 24 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. జనవరి 10వ తేదీ నాటికి అభ్యంతరాలన్నీ పరిష్కరిస్తామన్నారు. జనవరి 20న తుది ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు.