పోలింగ్ బూత్‌లో కలకలం : ఓటు వేసిన దృశ్యాలు మొబైల్ ఫోన్‌లో చిత్రీకరణ

ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించారు. కొందరు ఓటర్లు తాము ఓటు వేసిన దృశ్యాలను మొబైల్

  • Publish Date - May 6, 2019 / 07:31 AM IST

ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించారు. కొందరు ఓటర్లు తాము ఓటు వేసిన దృశ్యాలను మొబైల్

ఖమ్మం జిల్లా బూర్గంపాడులో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం బయటపడింది. పోలింగ్ బూత్ లోకి సెల్ ఫోన్లు అనుమతించారు. కొందరు ఓటర్లు తాము ఓటు వేసిన దృశ్యాలను మొబైల్ ఫోన్ లో చిత్రీకరించారు. అంతేకాదు.. ఆ వీడియోలను వాట్సాప్, ఫేస్ బుక్ లో షేర్ కూడా చేశారు. దీంతో ఈ వ్యవహారం దుమారం రేపింది. తాము ఏ పార్టీకి ఓటు వేశాము, ఏ గుర్తుకి ఓటు వేశాము తెలుపుతూ కొందరు ఓటర్లు మొబైల్ లో షూట్ చేశారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యాయి. టీఆర్ఎస్ గుర్తుకి ఒకరు, కాంగ్రెస్ గుర్తుకి మరొకరు ఓటు వేయడం ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లకూడదు. ఓటు ఎవరికి వేశామన్నది రహస్యంగా ఉంచాలి. ఓటు వేయడాన్ని షూట్ చెయ్యడం కానీ, ఫొటోలు తియ్యడం కానీ చెయ్యరాదు. బూర్గంపాడు పోలింగ్ కేంద్రంలో నిబంధనలకు విరుద్ధమైన పనులు జరుగుతున్నా.. ఎన్నికల అధికారులు మౌనంగా ఉండటం విమర్శలకు తావిచ్చింది. ఎన్నికలు అధికారుల తీరుపై పార్టీల నాయకులు, అభ్యర్థులు మండిపడ్డారు. దీనిపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో జిల్లా, మండల పరిషత్ స్థానాలకు సోమవారం (మే 6,219) పోలింగ్ జరుగుతోంది. తొలి విడతలో 197 జెడ్పీటీసీ.. 2వేల166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 69 ఎంపీటీసీలు, 2 జెడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2వేల 097 ఎంపీటీసీ, 195 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎంపీటీసీ స్థానాలకు 7వేల 72మంది, జెడ్పీటీసీ స్థానాలకు 882మంది పోటీ పడుతున్నారు. ఫస్ట్ ఫేజ్ లో 197 మండలాల్లో పోలింగ్ జరుగుతోంది.