Afghanistan people celebrations
Afghanistan people celebrations: శ్రీలంక చేతిలో పాకిస్థాన్ ఓడిపోయిన నేపథ్యంలో అఫ్గానిస్థాన్‌లో సంబరాలు చేసుకున్నారు. ఆసియా కప్-2022 టోర్నీలో భాగంగా ఇటీవల పాకిస్థాన్-అఫ్గానిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో స్టేడియంలో ఇరు జట్ల అభిమానులు కొట్టుకున్న విషయం తెలిసిందే. పాక్ విజయం సాధించిన అనంతరం అఫ్గానిస్థాన్ అభిమానులు రెచ్చిపోవడంతో ఇరుజట్ల అభిమానులు వాగ్వివాదానికి దిగి ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోయింది. దీంతో పాక్ కు తగినశాస్తి జరిగిందంటూ అఫ్గాన్ అభిమానులు బాణసంచా కాల్చారు. అఫ్గాన్ లో వారు సంబరాలు చేసుకుంటోన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అఫ్గాన్ రాజధాని కాబూల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. చిన్నాపెద్దా తేడా లేకుండా అందరూ వీధిలోకి వచ్చి ఉత్సాహంగా డ్యాన్సులు చేస్తూ గడిపారు. కాగా, నిన్నటి మ్యాచులో పాకిస్థాన్ పై శ్రీలంక 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.
#Afghans ?? Celebrations in Capital #Kabul , #Afghanistan to celebrate Sri Lanka’s victory over Pakistan in the #AsiaCup2022Final . pic.twitter.com/8ZnFkN5aKv
— Abdulhaq Omeri (@AbdulhaqOmeri) September 11, 2022
COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు