COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు

దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,975 మంది కోలుకున్నట్లు చెప్పింది. మృతుల సంఖ్య 5,28,165కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 47,176 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 215.26 కోట్ల వ్యాక్సిన్లు వినియోగించినట్లు పేర్కొంది.

COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు.. 47,176 యాక్టివ్ కేసులు

india corona cases

COVID-19: దేశంలో కొత్తగా 5,221 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 5,975 మంది కోలుకున్నట్లు చెప్పింది. మృతుల సంఖ్య 5,28,165కి చేరిందని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 47,176 మంది చికిత్స తీసుకుంటున్నారని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.82 శాతంగా ఉందని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు 215.26 కోట్ల వ్యాక్సిన్లు వినియోగించినట్లు పేర్కొంది.

వాటిలో రెండో డోసులు 94.53 కోట్లు, బూస్టర్ డోసులు 18.34 కోట్లు ఉన్నట్లు వివరించింది. నిన్న దేశంలో 30,76,305 డోసుల వ్యాక్సిన్లు వేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.71 శాతం ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,39,25,239కు చేరిందని వివరించింది.

వారాంతపు పాజిటివిటీ రేటు 1.72 శాతంగా ఉన్నట్లు చెప్పింది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 88.95 కోట్ల కరోనా పరీక్షలు చేసినట్లు వివరించింది. నిన్న 1,84,965 కరోనా పరీక్షలు చేసినట్లు చెప్పింది.

Ganesh Laddu: వేలంలో గణేశుడి లడ్డూ రూ.60.83 లక్షలు పలికిన వైనం