అమరావతి ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల పట్ల తమకు సానుభూతి ఉందన్నారు.
అమరావతి ప్రాంత రైతుల సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. రైతుల పట్ల తమకు సానుభూతి ఉందన్నారు. జిల్లాల వారిగా అభివృద్ధే ప్రభుత్వం అజెండా అన్నారు. కొందరు రాజధాని రైతుల తన దగ్గరకు వచ్చారని తెలిపారు. అసలు అసైనీలకు కాకుండా..వారి వద్ద నుంచి కొనుగోలు చేసిన తమకే భూములు దక్కేలా జీవోను సవరించాలని కోరారని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఉద్యోగుల తరలింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. రాజధాని రైతులు తమ వద్దకు వచ్చి సమస్యలు చెబితే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని చెప్పారు.
మరోవైపు అమరావతిలో హైపవర్ కమిటీ మూడో సమావేశం అయింది. కేబినెట్ భేటీలో చర్చించిన అంశాలపై ఇవాళ మరోసారి చర్చిస్తున్నారు. మూడు రాజధానులపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టిగ్ గ్రూప్ ఇచ్చిన నివేదికలను హైపవర్ కమిటీ అధ్యయనం చేస్తోంది. మంత్రలు, ఐఏఎస్, ఐపీఎస్ లతో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఇప్పటికే పలు సూచనలు చేసింది. రెండుసార్లు భేటీ అయిన హైపవర్ కమిటీ మరోసారి సమావేశం అయింది.
(జనవరి 17, 2020) వ తేదీనే ప్రభుత్వానికి హైపవర్ కమిటీ నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. రైతులు, ఉద్యోగులతోపాటు భాగస్వామ్య పక్షాల అభిప్రాయం తీసుకునే అవకాశం ఉంది. గత సమావేశాల్లో పరిపాలనే కాదు అభివృద్ధి వీకేంద్రకరణ ఎలా జరగాలన్న అంశంపై హైపవర్ కమిటీ దృష్టి పెట్టింది. బీసీజీ, జీఎన్ రావు కమిటీల నివేదికలే కాకుండా అన్ని అంశాలపై క్షుణ్ణంగా చర్చించింది. కేవలం అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే కాకుండా పరిపాలన వికేంద్రీకరణ జరగాలని కమిటీ భావించింది. దానికి సంబంధించి ప్రభుత్వం ముందు పలు ప్రతిపాదనలు పెట్టింది. ఉద్యోగుల తరలింపుపై పలు సూచనలు చేసింది.