ఆ జిల్లాలో క్షుద్రపూజలు : ఏ పార్టీ గెలుస్తుందో చెప్పు చెబుతుంది

  • Publish Date - April 18, 2019 / 09:07 AM IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందో కాలికి వేసుకునే ఓ ‘చెప్పు’ చెబుతుందా? అంటే అవుననే నమ్ముతున్నారు ఏపీ వాసులు. ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడేందుకు ఇంకా నెల రోజులకు పైనే సమయం ఉంది. కానీ అప్పటి వరకూ ఆగలేని కొందరు క్షుద్రపూజల ద్వారా తెలుసుకునేందుకు యత్నిస్తున్నారు. ఆయా పార్టీల అభిమానులు క్షుద్రపూజలు చేయిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరిలో జోరుగా క్షుద్రపూజలు చేయిస్తున్నారు పలు పార్టీల కార్యకర్తలు. 
 

గెలుపు పార్టీ ఏదో తెలుసుకునేందుకు జాతకాలు కూడా చెప్పించుకుంటున్నారు. గుళ్లూ గోపురాలు సందర్శిస్తున్నారు. ఇలా ఎవరికి తోచినట్లుగా వారి వారి పద్ధతులద్వారా గెలుపు పార్టీ కోసం శతవిధాల ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వెంకటగిరిలో ఒక చెప్పును ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంచి దానిపై వారి చేతి వేళ్లను ఉంచి వారి వేళ్లపై పసుపు కలిపిన బియ్యాన్ని..పూలను పోస్తు..పలు పార్టీల పేర్లను పలుతున్నారు. ఏ పార్టీ పేరు చెప్పిన సమయంలో ఆ చెప్పు ఆగితే ఆ పార్టీ గెలుపు సాధిస్తుందనీ..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నమ్ముతున్నారు.  ఇప్పటి వరకూ ఎన్నికల్లో బెట్టింగ్ దందాలను అరికట్టేందుకు నానా తంటాలు పడిన పోలీసులు ఇప్పుడు ఈ క్షద్రపూజల విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.