జగన్..తప్పు చేస్తున్నారు..మూడు రాజధానులు ఏ రాజ్యంగంలోను లేదు

  • Publish Date - January 2, 2020 / 06:53 AM IST

మూడు రాజధానులంటూ పిచ్చి నిర్ణయం తీసుకున్న సీఎం జగన్ ఘోరమైన తప్పు చేస్తున్నారనీ..మూడు రాజధానుల అంశం ఏ రాజ్యాంగంలోను లేదని మాజీ మంత్రి..టీడీపీ నేత యనమల రామకృష్ణ విమర్శించారు. రాజధాని అమరావతి పనులు నిలిపివేసి తప్పు చేస్తున్నారనీ..అమరావతి ప్రాంతంలో రాజధాని ఉండలంపై సీఎం జగన్ కు..ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులున్నాయో ప్రజలకు చెప్పాలని..ఓట్లు వేసిన అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా రాజధానిపై నిర్ణయం తీసుకోవటం దారుణమని అన్నారు. 

అమరావతి నిర్మాణానికి జగన్ కు ఉన్న ఇబ్బందులేంటో ప్రజలకు  చెప్పాలని యనమల డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు పెట్టటం విషయంలో తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని స్పష్టంచేశారు. కానీ రాజధానులను మార్చటం ఏమిటంటూ ప్రశ్నించారు. మూడు రాజధానులు అనే అంశం ఏ రాజ్యాంగంలోను లేదని రాజ్యాంగ వ్యతిరేకంగా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్రాన్ని అథోగత పాలు చేస్తున్నారన్నారు. ఇటువంటి అనాలోచితన అవగాహనలేమి నిర్ణయాలతో రాష్ట్రం అభివృద్ధి జరగదనీ..పురోగమనం కాదు కదా తిరోగమనంలో రాష్ట్రం పయనించే నిర్ణయాలు తీసుకుంటు ప్రజల్ని నానా అగచాట్లకు గురిచేస్తున్నారని మండి పడ్డారు యనమల. 

ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయంతో ఆయన పాలసీ గురించి రాష్ట్రాన్ని నాశనం చేయటం సరికాదని సూచించారు.అటువంటి హక్కు వారికి ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. సీఎం జగన్ స్వార్థం కోసం..ఆయన స్వప్రయోజనాల కోసమే పాలన చేస్తున్నారు తప్ప ప్రజల కోసం రాష్ట్రాన్ని అభివృద్ది చేయాలన ఆలోచన సీఎంకు లేదని విమర్శించారు. ఇటువంటి నిర్ణయాలతో రాష్ట్రం నష్టపోతుందని  ఆ ప్రభావం బలహీన వర్గాలపై పడుతుందని బలహీన వర్గాల కోసం మా ప్రభుత్వం కృషి చేస్తోందని గొప్పలు చెప్పుకుంటు సీఎం జగన్ ఇటువంటి నిర్ణయాలతో ఆ వర్గాలు నష్టపోతాయనే విషయం తెలియకపోవటం దురదృష్టకరమనీ..ఇటువంటి అవగాహన లేమి సీఎం ప్రజలకు నష్టం కలిగిస్తున్నారని యనమల తీవ్రంగా విమర్శించారు.  విశాఖ పట్నం ఎనాటినుంచో అభివృద్ధి చెందుతోందని..అటువంటి వనరులు విశాఖ సొంతం అనీ.. ఇప్పుడు కొత్తగా సీఎం గారు ఏమీ అభివృద్ధి చెయాల్సిన పనిలేదని అన్నారు.  

ట్రెండింగ్ వార్తలు