వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. లక్ష కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా అంటూ ఆరోపించారు. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్య సృష్టించేందుకు మీడియాతో అలజడి రేపాలని చూస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసింది అదే కదా అంటూ దుయ్యబట్టారు.
అధికారంలో ఉన్నన్నాళ్లు పోలీసులను పచ్చ పార్టీ నేతలుగా మార్చుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే పచ్చ నేతల అవినీతిని బయటపెట్టేందుకు సీఎం జగన్.. సీబీఐతో దర్యాప్తు చేయిస్తున్నారని వెల్లడించారు. మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే సీఎం జగన్ నాడు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారని తెలిపారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారని చెప్పారు.
Also Read : శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించం : మంత్రి బొత్స
మీ పాలనలో వ్యవస్థలన్నిటినీ నిర్వీర్వం చేసి పోలీసులకు పచ్చ యూనిఫాం తొడిగించారు. అందుకే @ysjagan గారు సీబీఐ దర్యాప్తు కోసం డిమాండు చేశారు. ఇప్పుడు పోలీసులు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. డౌట్ ఉంటే శాంపిల్‌గా కోడెల కుటుంబం కేసులను సీబీఐకి అప్పగించమని అడగొచ్చు @ncbn గారూ. @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 10, 2019
పచ్చ దొంగలకు అమరావతి తప్ప ఇంకేది పట్టదు. లక్షల కోట్ల రియల్ ఎస్టేట్ రాబడుల గురించే ధ్యాసంతా. అందుకే ఏదో ఒక కృత్రిమ సమస్యను సృష్టించి అనుకూల మీడియాతో అలజడి లేపాలని చూస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండి మీరు చేసిందే అదే కదా. @ncbn @naralokesh @JaiTDP
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 10, 2019