వాగులో యువకుడు కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. నీళ్లల్లో చెట్టును పట్టుకుని ఉన్న యువకుడిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
ఎగువన కురుస్తున్న వర్షాలతో నల్గొండ జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొరటికల్ లో బిక్కేరు వాగు కూడా పొంగిపొర్లుతోంది. వాగును చూసేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. ఇదే సమయంలో ప్రవాహాన్ని చూస్తూ నీళ్లల్లోకి దిగిన ఓ యువకుడు వాగులో కొట్టుకుపోయాడు. చెట్టును పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నాడు. నీళ్లల్లో చెట్టును పట్టుకుని ఉన్న యువకుడిని స్థానికులు తాళ్ల సాయంతో కాపాడారు.
కొరటికల్ గ్రామంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆ వాగును చూసేందుకు స్థానికులతోపాటు చుట్టు పక్కల ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానికులు ఒడ్డుపై ఉండి వాగును చూస్తుండగా యువకుడు మాత్రం అత్యుత్సాహంతో వాగులోకి దిగాడు. నీళ్లల్లోకి దిగి అక్కడున్నటువంటి దృశ్యాలను చూసి ఆనందంతో పరవశించిపోయాడు.
ఈక్రమంలో వాగులో పడి నీటి ప్రవాహానికి యువకుడు కొట్టుకుపోయాడు. వాగులో కొట్టుకుపోయేక్రమంలో చెట్టును పట్టుకుని తన ప్రాణాలను కాపాడుకున్నాడు. దీంతో బతుకు జీవుడా అంటూ యువకుడు క్షేమంగా బయటపడ్డాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.