విజయనగరం : 20 రోజులు ఓపిక పడితే మనందరి ప్రభుత్వం వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. మీ అందరికి నేను ఉన్నా అనే భరోసా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి
విజయనగరం : 20 రోజులు ఓపిక పడితే మనందరి ప్రభుత్వం వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. మీ అందరికి నేను ఉన్నా అనే భరోసా ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వస్తే ప్రతి మహిళను లక్షాధికారిని చేస్తానని హామీ ఇచ్చారు. పార్వతీపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. అన్ని వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారని అన్నారు. పిల్లలను చదివించాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఉందన్నారు. ఈ ఎన్నికలు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని జగన్ అన్నారు. 2014 ఎన్నికల ముందు చంద్రబాబు మాయ మాటలు చెప్పారని, మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి అలాంటి మోసాలే కనిపిస్తున్నాయన్నారు.
Read Also : కుట్ర రాజకీయాలు కాకపోతే ఏంటీ : బదిలీలపై ఆగ్రహం
పార్వతీపురం ప్రాంతానికి మంచి చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని జగన్ అన్నారు. వైఎస్ హయాంలో తోటపల్లి ప్రాజెక్ట్ పనులు 90శాతం పూర్తి చేశారని.. మిగిలిన 10శాతం పనులు కూడా చంద్రబాబు ప్రభుత్వం చేయలేకపోయిందని విమర్శించారు. రబ్బర్ డ్యామ్ ప్రాజెక్ట్ తీసుకొచ్చి రైతన్నలకు వైఎస్ తోడుగా నిలిచారని అన్నారు. స్టాలిన్ తో టిఫిన్ చేసేందుకు, మమతతో భోజనం చేసేందుకు, రాహుల్ తో కాఫీ తాగేందుకు చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్ లో వెళతారని.. అదే ఫ్లైట్ లో ఒడిశా సీఎంను కలిసేందుకు మాత్రం వెళ్లరని విమర్శించారు. జంగావతి, వంశధార ప్రాజెక్టులపై ఒడిశా సీఎంతో మాట్లాడితే ఆ 2 ప్రాజెక్టులు ఎప్పుడో పూర్తయ్యేవి అని అన్నారు. చంద్రబాబు తన స్వార్థం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని జగన్ మండిపడ్డారు. పింఛన్, రేషన్ కార్డు, ఇల్లు మంజూరు కావాలంటే లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందన్నారు.
చంద్రబాబు ఇచ్చే రూ.3వేలకు మోసపోవద్దని జగన్ అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చే పథకం తీసుకొస్తామన్నారు. పిల్లలను బడికి పంపితే ఏటా రూ.15వేలు, వైఎస్ఆర్ చేయూత పథకం కింద ప్రతి మహిళకు రూ.75వేలు ఇస్తామన్నారు.
Read Also : బదిలీలపై కోర్టుకు ఏపీ సర్కార్ : మోడీ, షా భయంకర వ్యక్తులు – బాబు