కడప జల్లా ఎర్రచెర్లోపల్లిలో హై టెన్షన్ నెలకొంది. వైసీపీ అభ్యర్థి మేడా మల్లి ఖార్జునరెడ్డి తమ్ముడు మేడా సునీల్ రెడ్డిపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో సునీల్ తలకు గాయమైంది. పోలింగ్ పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న వైసీపీ నేత తమ్ముడిని వెంబడించి రాళ్లతో దాడిచేశారు. ఈ ఘటన వైసీపీ కార్యకర్తలు తెలియడంతో అతణ్ని రక్షించేందుకు ఘటనా స్థలానికి చేరుకోవడంతో టీడీపీ కార్యకర్తలు పరుగులు పెట్టారు.
ఆందోళనకారులు వెళ్లిపోయినప్పటికీ సునీల్ రెడ్డి ఘటనా స్థలంలోనే కూర్చుని నిరసన చేపట్టాడు. ఈ దాడికి దిగిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసేంత వరకూ కదిలేది లేదని అక్కడే కూర్చుని ఉండడంతో పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.