FIFA World Cup -2022
FIFA World Cup -2022: ఖతర్ లో జరుగుతున్న ఫిఫా ప్రపంచ కప్ ను చూసేందుకు ఓ వ్యక్తి అద్దాల దుస్తులను ధరించి వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చాడు. బ్రెజిల్ కు చెందిన ఆ అభిమాని ధరించిన దుస్తులు చాలా విభిన్నంగా ఉండడంతో అతడితో ఫొటోలు దిగేందుకు అక్కడి వారు పోటీ పడ్డారు. రంగు రంగుల అద్దాల దుస్తులు ధరించి స్టేడియానికి వచ్చిన ఆ అభిమాని చాలా హుషారుగా కనపడ్డాడు.
ఫిఫా ప్రపంచ కప్ ను పోలిన కప్ ను కూడా చేతిలో పట్టుకుని అతడు స్టేడియం వద్ద కలియతిరిగాడు. ఆ కప్ కూడా రంగు రంగుల అద్దాలతో మెరిసిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఒకరు ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అది వైరల్ అవుతోంది. నిన్న ఖతర్ ఎడ్యుకేషన్ స్టేడియంలో బ్రెజిల్-క్రొయేషియా మధ్య మ్యాచ్ జరిగింది.
ఆ సమయంలోనే బ్రెజిల్ అభిమాని ఇలా విచిత్ర వేషధారణతో కనపడ్డాడు. చాలా మంచి ఐడియాతో అతడు స్టేడియానికి వచ్చాడని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు. కాగా, సెమిఫైనల్ లోకి ప్రవేశించడానికి నిన్న జరిగిన మ్యాచులో క్రొయేషియా చేతిలో బ్రెజిల్ 4-2 తేడాతో ఓడిపోయింది.
Brazil lost the game to Croatia but throughout the years in World Cup, they have the most dedicated fans ever.
Brazillian football fan covered himself with mirrors. Looked like a walking AR filter. pic.twitter.com/l8ZJky7XnZ
— Min Min #KitaBoleh (@aymeemin) December 9, 2022
Bangladesh vs India: బంగ్లాదేశ్‌పై 227 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం