‘Chief Twit’ Elon Musk: బాత్‌రూం సింక్‌తో ట్విటర్ ప్రధాన కార్యాలయంలోకి ఎలాన్ మస్క్.. వీడియో వైరల్
అమెరికాలోని ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రేపు ముగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాత్‌రూం సింక్‌తో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది. దీంతో ఆయన ట్విటర్ ఒప్పందం పూర్తవుతుందని ప్రచారం జరుగుతోంది.
- T Venkateshwarlu
- Published On : October 27, 2022 / 09:39 AM IST
‘Chief Twit’ Elon Musk: అమెరికాలోని ‘టెస్లా’ అధినేత ఎలాన్ మస్క్ ట్విటర్ కొనుగోలు ఒప్పందాన్ని రేపు ముగించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ట్విటర్ ప్రధాన కార్యాలయంలో బాత్‌రూం సింక్‌తో అడుగుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ అవుతోంది.
దీంతో ఆయన ట్విటర్ ఒప్పందం పూర్తవుతుందని ప్రచారం జరుగుతోంది. రూ.3.6 లక్షల కోట్లతో ఈ ఒప్పందాన్ని పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంకర్లతో ఎలాన్ మస్క్ చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలోనే ఆయన ట్విటర్ ప్రధాన కార్యాలయానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ‘‘ట్విటర్ ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నాను.. పూర్తిగా అర్థం చేసుకోవాలి’’ అని ఎలాన్ మస్క్ పేర్కొన్నారు.
కాగా, తన ట్విటర్ అధికారిక ఖాతాలో ‘చీఫ్ ట్విట్’ అని కూడా ఆయన పెట్టుకోవడం గమనార్హం. ట్విటర్ ను కొనుగోలు చేసేందుకు మరికొందరు కూడా పోటీ పడ్డారు. రేపటిలోగా ఎలాన్ మస్క్ ట్విటర్ ను సొంతం చేసుకుంటారని తెలుస్తోంది.
Entering Twitter HQ – let that sink in! pic.twitter.com/D68z4K2wq7
— Elon Musk (@elonmusk) October 26, 2022
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
