Viral Video
Viral Video: గుట్కా నమిలే అలవాటు ఉన్నవారు బస్సుల్లో కిటికీ వద్ద కూర్చుంటారు. అలాచేస్తే కిటికీలో నుంచి ఉమ్మి వేయడానికి వీలుగా ఉంటుందని భావిస్తారు. అయితే, విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో కిటికీలో నుంచి బయటకు ఉమ్మివేసే అవకాశం ఉంటుందా? విమాన కిటికీని తెరిచే వీలు ఉండదు. ఒక వేళ పగులకొట్టి తెరిస్తే ఇక ప్రయాణికుల సంగతి అంతే.
ఇవన్నీ తెలిసినప్పటికీ ఓ యువకుడు ఎయిర్ హోస్టెస్ ను పిలిచి ఆమెతో.. ‘‘దయచేసి కిటికీ తెరవండి.. గుట్కా ఉమ్మివేయాలి’’ అని సరదాగా అన్నాడు. దీంతో ఎయిర్ హోస్టెస్ సహా అక్కడి వారందరూ బిగ్గరగా నవ్వారు. చేతిలో గుట్కాను రుద్దుతున్నట్లు ఆ సమయంలో ఆ యువకుడు నటించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గోవింద్ శర్మ అనే యూజర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది సేపటికే వేలాది మంది దీన్ని వీక్షించారు. గుట్కా తినే స్నేహితులకు ఈ వీడియోను పంపాలని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. ఆ యువకుడు చాలా సహజమైన రీతిలో నటించాడని, గుట్కా తినే అలవాటు ఉన్నవాడిలా చేశాడని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.
Pakistan power outage: పాక్‌లోని ఇస్లామాబాద్, లాహోర్, కరాచీ సహా అనేక నగరాల్లో విద్యుత్తు కట్