IAS officer Viral video: పేద విద్యార్థినులతో ఓ ఐఏఎస్ అధికారిణి అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. విద్యార్థినుల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిన ఆ ఐఏఎస్ అధికారిణి.. అమ్మాయిలు కోరుతున్న కనీస సౌకర్యాలపై మండిపడ్డారు. ‘కండోమ్లు కూడా ఉచితంగా కావాలా ఏంటీ?’ అంటూ విద్యార్థినులను హేళన చేస్తూ మాట్లాడారు. ఈ ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ బీజేపీ నేతలు మండిపడ్డారు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఐఏఎస్ అధికారిణి, బిహార్ మహిళా, శిశు అభివృద్ధి సంస్థ డైరెక్టర్ హర్జోత్ కౌర్ బమ్రా విద్యార్థినులతో మాట్లాడారు. ఆ సమయంలో ఓ అమ్మాయి మాట్లాడుతూ… ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలుచేస్తోందని, ఉచితంగా ఎన్నో వస్తువులను అందజేస్తోందని చెప్పింది. అలాగే, 20-30 రూపాయల శానిటరీ నాప్కిన్స్ ను విద్యార్థునులకు ఉచితంగా ఇస్తే బాగుంటుందని పేర్కొంది.
దీంతో మండిపడ్డ హర్జోత్ కౌర్ బమ్రా… అమ్మాయిల కోరికలకు హద్దే ఉండదని అన్నారు. సర్కారు ఇలాగే ఉచితంగా ఇస్తూ పోతే ఉచితంగా జీన్స్ ప్యాంట్లు, షూలు కూడా కావాలంటారని ఎద్దేవా చేశారు. అలాగే, ఇంకా ముందుకు వెళ్లి కుటుంబ నియంత్రణ కోసం కండోమ్లు, గర్భనిరోధకాలు కూడా అడుగుతారని చెప్పింది. దీంతో “విద్యార్థినులతో ఇలాగేనా మాట్లాడేది” అంటూ ఆమెపై పలువురు ప్రముఖులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
अब नितिश-तेजस्वि सरकार के IAS से मिलिए। हरजोत कौर बिहार की बेटियों को सानिटरी नैपकिन माँगने पर पाकिस्तान भेजेंगी। pic.twitter.com/VjVv0EF0AP
— Dr. Amrita Rathod BJP (@AmritaRathodBJP) September 28, 2022
“నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”.. https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw