on the stage, bride slaps bridegroom's cheek
Viral Video: మన దేశంలో పెళ్లి అనేది చాలా పెద్ద కార్యక్రమం. చాలా హడావుడి ఉంటుంది. అలాగే అతి కూడా అంతే ఉంటుంది. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, స్నేహితులు చేసే అతి చాలాసార్లు ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తుంది. అయినా సరే, మొహమాటానికి వెళ్లి ఏమీ అనకుండా ఉంటారు. మరీ మితిమీరితే తప్పితే.. ఇలాంటివన్నీ వధూవరులు భరిస్తుంటారు. అయితే రోజులన్నీ ఒకేలా ఉండవు. కాలానికి అనుగుణంగా మనుషులు కూడా మారుతుంటారు. ఈ విషయంలో నేటి వధవులు చాలా అప్డేట్ అవుతున్నారు.
Meghalaya: మేఘాలయలో ఆపరేషన్ లోటస్ షురూ.. తొలిరోజే కాషాయ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు
అమ్మాయిలు తమకు నచ్చనిదాన్ని భరించడానికి ఇష్టపడడం లేదు. సందర్భం ఏదైనా ముఖం మీదే తాడోపేడో తేల్చుకుంటున్నారు. అది పెళ్లి స్టేజ్ అయినా సరే. కొద్ది రోజుల క్రితం వరుడు విగ్గు పెట్టుకున్నాడని తెలిసి వధువు పీటల మీద ఉన్న పెళ్లిని రద్దు చేసుకుంది. మరొక ఘటనలో కట్నం అడిగాడని పెళ్లి రద్దు చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో చాలానే కనిపిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒక ఘటనే వెలుగు చూసింది. తనకు బలవంతంగా స్వీట్ తినిపించబోయిన వరుడి చెంప చెల్లుమనిపించింది వధువు. అనంతరం ఇద్దరు ఒకరి జుట్టు మరొకరు పట్టుకుని కొట్టుకున్నారు.
Kalesh B/w Husband and Wife in marriage ceremony pic.twitter.com/bjypxtJzjt
— Ghar Ke Kalesh (@gharkekalesh) December 13, 2022
అయితే ఇది ఎంత వరకు నిజం, ఎంత వరకు అబద్ధం అనే విషయంలో క్లారిటీ లేదు కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. పెళ్లి జరగుతుండగా అమ్మాయికి స్వీట్ తినిపించాలని స్నేహితులు అడిగారు. అందుకు వరుడు స్వీట్ తీసుకుని వధువుకు తినిపించబోయాడు. ఆమె వద్దని చెప్పింది. అయినా బలవంతంగా తినిపించబోయాడు. దీంతో వధువుకు చిర్రెత్తుకొచ్చిన వరుడి చెంప చెల్లుమనిపించింది. వరుడికి కోపం వచ్చి తిరిగి ఆమెను కొట్టారు. అనంతరం ఇద్దరు జుట్టు పట్టుకుని కొట్టుకుంటుండగా బంధవులు, స్నేహితువులు వారిని విడదీశారు.