Meghalaya: మేఘాలయలో ఆపరేషన్ లోటస్ షురూ.. తొలిరోజే కాషాయ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో నేషనల్ పీపుల్స్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యూడీపీకి 8 మంది, పీడీఎఫ్ నలుగురు, హెచ్ఎస్‭పీడపీ ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు సహా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక విపక్షంలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఎన్సీపికి చెందిన ముగ్గురు, కేహెచ్ఎన్ఏఎమ్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే టీఎంతో విపక్షంలో ఉన్నారు.

Meghalaya: మేఘాలయలో ఆపరేషన్ లోటస్ షురూ.. తొలిరోజే కాషాయ పార్టీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలు

4 Meghalaya MLAs join BJP as party seeks north-east boost in upcoming polls

Meghalaya: ఆపరేషన్ లోటస్ పేరుతో ఒక్కో రాష్ట్రంలో విపక్ష ప్రభుత్వాన్ని పడగొట్టి కమల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోన్న భారతీయ జనతా పార్టీ.. తాజాగా మేఘాలయలో ఆపరేషన్ లోటస్‭కు శ్రీకారం చుట్టినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు తాజాగా మేఘాలయ రాష్ట్ర పర్యటనకు వెళ్లారు. కాగా, ఆయన అక్కడికి వెళ్లిన తొలి రోజే (బుధవారం) ఆ రాష్ట్రానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇందులో బీజీపీ మిత్ర పక్ష పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం గమనార్హం.

వాస్తవానికి మేఘాలయలో నేషనల్ పీపుల్స్ పార్టీ అధికారంలో ఉంది. ఆ పార్టీకి ఇతర పక్షాలు సహా బీజేపీ సైతం మద్దతు ఇస్తోంది. అయితే కూటమిలో ఉన్న ఎమ్మెల్యేలనే తమ పార్టీలో చేర్చుకోవడం గమనార్హం. వచ్చే ఏడాది మేఘాలయ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ఈసారి ఎలాగైనా సొంతంగా తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న సంకల్పంలో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ లోటస్ ప్రారంభించినట్లు తెలుస్తోంది.

Mayawati: కీర్తికి తగ్గట్టుగా సమాధానం చెప్పారు.. భారత సైన్యానికి మాయావతి ప్రశంసలు

60 స్థానాలున్న మేఘాలయ అసెంబ్లీలో నేషనల్ పీపుల్స్ పార్టీకి 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక యూడీపీకి 8 మంది, పీడీఎఫ్ నలుగురు, హెచ్ఎస్‭పీడపీ ఇద్దరు, స్వతంత్రులు ఆరుగురు సహా బీజేపీ ముగ్గురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కొనసాగుతోంది. ఇక విపక్షంలో ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక ఎన్సీపికి చెందిన ముగ్గురు, కేహెచ్ఎన్ఏఎమ్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే టీఎంతో విపక్షంలో ఉన్నారు.

ఇక బీజేపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు స్వతంత్రులు కాగా, ఒకరు టీఎంసీకి చెందిన వారు, మరొకరు అధికార పార్టీ ఎన్‮‭పీపీకి చెందిన వారు.

YS Sharmila: షర్మిల‎ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ప్రశ్నించిన హైకోర్టు