Sea Lions : బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ప్రజలు… వెంటపడి తరిమిన సముద్ర సింహాలు
వీకెండ్....సెలవు పూట సరదాగా బీచ్ లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన పర్యాటకులకు నిరాశ ఎదురయ్యింది.
- chvmurthy
- Published on- July 11, 2022 / 07:03 PM IST
Sea Lions
Sea Lions : వీకెండ్….సెలవు పూట సరదాగా బీచ్ లో ఎంజాయ్ చేద్దామని వచ్చిన పర్యాటకులకు నిరాశ ఎదురయ్యింది. ప్రశాంతంగా బీచ్ ఒడ్డున సేద తీరుతున్న రెండు సముద్ర సింహాలను డిస్టర్బ్ చేయటంతో అవి అక్కడికి వచ్చిన అందరినీ తరిమేశాయి.
అమెరికాలోని శాన్ డియోగోలోిని బీచ్ వీకెండ్ లో సందర్శకులతో కళకళలాడుతోంది. సముద్రంలో జలకాలాడుతూ కేరింతలు కొట్టే వాళ్లు కొందరైతే…. బీచ్ ఒడ్డున ఆటలాడే మరి కొందరు ఎంజాయ్ చేస్తున్నారు. బీచ్ ఒడ్డున రెండు సముద్ర సింహాలు నిద్రపోతున్నాయి. అయితే ఒక మహిళ వాటి దగ్గరకు వెళ్లి వాటిని ఫోటో తీసింది. మరింత ముందుకు వెళ్లి వాటిని ఫోటో తీసే ప్రయత్నం చేయగా వాటికి నిద్రాభంగం అయ్యింది.
దీంతో అవి ఆ మహిళపైకి దూసుకు వచ్చాయి. ఆ మహిళ కాళ్లకు పని చెప్పి పరుగు లంఘించుకుంది. నిద్ర లేచిన సముద్ర సింహాలు బీచ్ లో ఆటలాడుకుంటున్న వారిని కూడా తరిమాయి. దీంతో బీచ్ లో ఉన్న వారు, సముద్రంలో ఉన్నవారు అందరూ పరుగు లంకించుకున్నారు. అక్కడే ఉన్న రక్షణ సిబ్బంది సముద్ర సింహాలను సముద్రంలోకి వెళ్లేలా చేశారు.
సందర్శకులెవరూ వాటి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కాగా అదే సమయంలో అక్కడ ఉన్న ఒక సందర్శకురాలు ఈ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆవీడియో మీరు కూడా ఓ లుక్కేయండి..
