Woman Driver : హైవే పై లారీ నడుపుతున్న మహిళ… ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
తమిళనాడులోని ఒక మహిళ హెవీ లోడుతో ఉన్న లారీని హైవేపై నడుపుతున్న వీడియోను ఒక ఐపీఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసి పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.
- chvmurthy
- Published On : July 19, 2022 / 06:49 PM IST
Tamilnadu Woman Driver
Woman Driver : మహిళలు అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. పట్టుదలతో మహిళలు సాధించలేనిది ఏదీ లేదని ఇప్పటికే అనేక విషయాల్లో ప్రూవ్ అయ్యింది కూడా. తాజాగా తమిళనాడులోని ఒక మహిళ హెవీ లోడుతో ఉన్న లారీని హైవేపై నడుపుతున్న వీడియోను ఒక ఐపీఎస్ అధికారి ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఈ వీడియోను చూసి పలువురు ఆమెను ప్రశంసిస్తున్నారు.
ఐపీఎస్ అధికారి అవనీష్ శరణ్ షేర్ చేసిన ఈ వీడియో తమిళనాడు కు చెందిన లారీని ఒక మహిళ హైవే పై వేగంగా నడుపుతున్న దృశ్యాలు కనిపించాయి. వీడియో తీయటంచూసిన మహిళ చిరునవ్వులు చిందించింది. డ్రైవర్ పురుషుడా, స్త్రీ నా అనేది లారీ పట్టించుకోదని ఈ పోస్ట్ కు క్యాప్షన్ ఇచ్చారు.
ఆమె ఎంతటి విశ్వాసం కలిగి ఉందనేది ఆమె నవ్వు వెల్లడిస్తోందని నెటిజన్లు మహిళను ప్రశంసించారు. మహిళా సాధికారతకు ఆమె నిలువెత్తు నిదర్శనమని పలువురు కామెంట్ చేశారు. ఈ వీడియోకు ఇప్పటివరకూ 2.24 లక్షల వ్యూస్ రాగా, పెద్దసంఖ్యలో మహిళ సాహసాన్ని కొనియాడుతూ తమ ప్రతిస్పందనలు తెలియచేశారు.
ट्रक को इससे क्या मतलब कि चलाने वाला ‘पुरुष’ है या ‘महिला.’ ❤️ pic.twitter.com/g9IEAocv7p
— Awanish Sharan (@AwanishSharan) July 17, 2022
