Viral Video: మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన వైనం

ఓ మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనంతరం కొద్దిసేపటికే అందరూ చూస్తుండగానే అది కుప్పకూలిపోయింది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి.

Viral Video: ఓ మూడంతస్తుల భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది. అనంతరం కొద్దిసేపటికే అందరూ చూస్తుండగానే అది కుప్పకూలిపోయింది. ఢిల్లీలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఓ కెమెరాకు చిక్కాయి. రోషనరా రోడ్ లోని మూడంతస్తుల భవనంలో జైపూర్ గోల్డెన్ ట్రాన్స్ పోర్ట్ లాజిస్టిక్స్ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

అందులోనే ఇవాళ ఉదయం 11.50 గంటలకు మంటలు అంటుకున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సంస్థ 18 ట్రక్కులను అక్కడికి పంపి, మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. ఆ సమయంలోనే భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 5 క్షణాల్లో ఆ భవనం పూర్తిగా కుప్పకూలడం అందరినీ ఆశ్చర్యపర్చింది. ఆ భవనం కూలిపోతుందని ఎవరూ ఊహించలేదు.

అది కూలిపోయాక దట్టమైన పొగ కనపడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు చెప్పారు. ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగింది. ఆ ప్రాంతంలో అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారు. శిథిలాలను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల భవనానికి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది.

Unemployment Rate: దేశంలో 6.4 శాతం నుంచి 7.5 శాతానికి పెరిగిన నిరుద్యోగం

ట్రెండింగ్ వార్తలు