2020 నుంచి కొత్త రూల్: పెళ్లి చేసుకోవాలంటే పరీక్ష రాయాల్సిందే

  • Publish Date - November 24, 2019 / 05:33 AM IST

ఇండోనేషియాలో 2020 నుంచి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయి, అబ్బాయి లకు నచ్చి వారి కుటుంబికులు ఒప్పుకుంటే సరిపోదు. ఎందుకంటే అక్కడి ప్రభుత్వం కొత్త రూల్స్ అమల్లోకి తెచ్చింది. వాటి ప్రకారం మూడు నెలలు కోర్సు పూర్తి చేసి.. ఎగ్జామ్ పాసవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాతే పెళ్లి.  ఒకవేళ పరీక్ష కనుక పాస్ కాకపోతే వాళ్లు పెళ్లికి అనర్హులు అయినట్టే.

పెళ్లంటే జీవిత భాగస్వామిని ఎన్నుకోవడం మాత్రమే కాదు, జీవితాన్ని ఎన్నుకోవడం. పిల్లలను సక్రమంగా పోషించగలగాలి. అవేం తెలియకుండా పెళ్లి చేసుకుంటే.. వారి జీవితమే కాదు, వారిపై ఆధారపడే పిల్లల భవిష్యత్తు కూడా అంధకారం అవుతుంది. అందుకే, ఇండోనేషియా ప్రభుత్వం పెళ్లి కోసం ప్రత్యేకంగా మూడు నెలల సర్టిఫికెట్‌ కోర్సును ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఈ కోర్సును ఉచితంగానే అందిస్తోంది.

పెళ్లి చేసుకోడానికి ముందు ప్రతి ఒక్కరూ ఈ కోర్సును పూర్తి చేసి, పరీక్షలో పాస్ కావాలి. వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా సర్టిఫికెట్లు జారీ చేస్తుంది. ఆ సర్టిఫికెట్‌ను దక్కించుకొనే వ్యక్తులు మాత్రమే పెళ్లికి అర్హులు అవుతారు. ఈ రూల్ 2020 నుంచి అమల్లోకి వస్తుందని ఇండోనేషియా హ్యూమన్ డెవలప్మెంట్ అండ్ కల్చరల్ అఫైర్స్ విభాగం ప్రకటించింది.