యాంకర్‌ ఇంటి గేటుకి జంతువుల కళేబరాలు

  • Publish Date - February 22, 2020 / 06:07 AM IST

ఇంగ్లాండ్‌ హాంప్‌షేర్‌లోని మార్చ్‌వుడ్‌కు చెందిన ప్రముఖ BBC యాంకర్‌ క్రిస్ పాక్‌హామ్‌ ఇంటిముందు గేటుకు జంతువుల కళేబరాలు వేలాడదీశారు దుండగులు. ఇది ఎవరు చేశారో తెలియదు కానీ, అతన్ని భయపెట్టాలని ప్రయత్నించారు. కానీ, క్రిస్ పాక్‌హామ్‌ ఇలాంటి వాటికి నేను భయపడను అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కొన్ని సంవత్సరాలుగా వన్యప్రాణుల సంరక్షణ కోసం క్రిస్ కృషి చేస్తున్నారు. అది నచ్చనివారు ఇలా చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఉదయం లెచేసరికి గేటుకు జంతువులు, కాకుల కళేబరాలు వేలాడదీశారు. కొన్నిరోజుల క్రితం చనిపోయిన అడవి జంతువుల కళేబరాలను ఇంటి గేటుకి వేలాడదీయటం ప్రారంభించారు.

తాజాగా రెండు చనిపోయిన కాకులను ఇంటి గేటుకు వేలాడదీశారు. ఆ తర్వాత ఓ చనిపోయిన నక్కను ఇంటి దగ్గరలో పడేశారు. గత గురువారం అర్థరాత్రి కూడా ప్రమాదంలో చనిపోయిన ఓ ఆడ బాడ్జర్‌ను అతడి ఇంటి గేటు మధ్యలో వేలాడదీశారు. ఆ రాత్రి ఇంటికి వచ్చిన అతడు గేటుకు వేలాడదీసి ఉన్న బాడ్జర్‌ కళేబరాన్ని చూసి ఎంతో బాధపడ్డాడు.

పాక్‌హామ్‌ మాట్లాడుతూ… నేనిది తట్టుకోలేకపోతున్నా. ఈ సంఘటన నుంచి త్వరగా కోలుకుంటానని అనుకుంటున్నా. చుట్టుపక్కలవారే ఈ పని చేస్తున్నారని అనిపిస్తొంది. వాళ్లకు మాత్రమే తెలుసు నేనెక్కడ ఉంటానో. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేసే పనిని ఆపను. ఎందుకంటే నేను చేస్తున్న పని మంచిదని నాకు తెలుసు..అని అన్నారు.