పశ్చిమ బెంగాల్‌లో కొంతమంది రోజూలాగే చేపలు పట్టేందుకు వెళ్లారు. ఎవరికి వాళ్లు వలలు వేశారు. వారిలో తరుణ్ బేరా అనే వ్యక్తి వలకు మాత్రం ఓ భారీ చేప చిక్కింది. ఆ చేప ఏకంగా 18.5 కిలోల ఉంది. అంతేకాదు ఈ భారీ చేపను చూసేందుకు స్థానికులు తరలివచ్చారు. ఈ చేపను కనీసం వంట వండి నలభై మంది వరకు తినేయొచ్చని స్థానికులు చెబుతున్నారు.
ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉలుబెరియాలో గంగానది ఒడ్డున జరిగింది. తరుణ్ బేరా వలకు చేప చిక్కిందని గ్రహించి బయటికి తీసేందుకు ప్రయత్నించగా బరువుగా అనిపించింది. ఎంత లాగినా బయటికి రాలేదు. దీంతో ఫ్రెండ్స్ సహాయంతో ఆ చేపను బయటకు లాగారు. వలను బయటకు తీయగానే దానికి పెద్ద చేప చిక్కిందని తెగ సంతోష పడ్డారు.
ఈ చేప బెట్కీఫిష్ జాతికి చెందింది. అతడు ఈ చేపను వేలం కూడా వేశాడు. వేలం అంటే ఏ 4వందలో, 5వందలకో అమ్ముడుపోతుంది అనుకుంటున్నారా.. రూ.12వేలకు అమ్ముడుపోయింది. కానీ తరుణ్ బేరా.. ఈ చేపను కనీసం 14వేలకు అమ్మలని అనుకున్నానని తెలిపారు.