Biryani Samosa Latest Dish : సమోసాలో బిర్యాని.. ఫుడ్ లవర్స్ బేజార్
సమోస, బిర్యాని వేటికవి అద్భుతమైన డిష్ లు.. ఈ రెండు కలగలిపి 'బిర్యాని సమోస' చేస్తే ఎలా ఉంటుంది? ఎవరికొచ్చిందో కానీ అద్భుతమైన ఐడియా అమలు చేసేసారు. ఇప్పుడు ఈ డిష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు కొత్త డిష్ ట్రై చేద్దాం.. అని తహతహలాడుతుంటే ఫుడ్ లవర్స్ మాత్రం దీని పేరు విని బేజార్ అవుతున్నారు.
- Lakshmi 10tv
- Published On : March 30, 2023 / 05:43 PM IST
Biryani Samosa Latest Dish
Biryani Samosa Latest Dish : ఫుడ్ లవర్స్ (Food lovers) మార్కెట్లోకి ఏ కొత్త వంటకం వచ్చినా రుచి చూడాలని ట్రై చేస్తారు. అలాంటి వారి కోసం కొత్త కాంబినేషన్ వచ్చింది. అదే ‘బిర్యాని సమోస’ ( samosa biryani). ఇదేం కాంబినేషన్ బాబోయ్ అనుకుంటున్నారా? శ్రీనగర్ (srinagar) లోని క్లౌడ్ కిచెన్ (cloud kitchen) లో ఈ వంటకం స్పెషల్ గా దొరుకుతోందట.. ఈ విషయాన్ని ట్విట్టర్ లో @khansaamaa అనే వ్యక్తి ట్విట్టర్ లో షేర్ చేయడంతో ఈ వంటకం ఇప్పుడు వైరల్ గా మారింది.
Cheetah: నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. తల్లీ, పిల్లలు క్షేమం.. వైరల్ వీడియో
ఫోటోలో చూస్తుంటే ‘బిర్యాని సమోస’ తయారీ చాలా ఈజీ అనిపిస్తోంది. సమోస తయారు చేసుకుని స్టైసీగా తయారు చేసుకున్న చికెన్ బిర్యానిని (chicken biryani) అందులో ఫిల్ చేసి నూనెలో వేడి చేస్తే ఈ వంటకం రెడీ అయిపోతుంది. ఇక దీని రుచి ఎలా ఉంటుంది? అంటే సమోస టేస్ట్ చెప్పగలం.. చికెన్ బిర్యాని టేస్ట్ చెప్పగలం.. ఈ రెండూ కలగలిపిన రుచిని తింటే కానీ చెప్పలేం. అయితే ఈ ఫుడ్ ని తిన్నవారు మాత్రం ఈ కాంబినేషన్ బాబోయ్ అంటున్నారు. ఈ న్యూస్ చదివినవారు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు కొత్త డిష్ ట్రై చేస్తే ఏమౌతుంది? అని అభిప్రాయపడుతున్నారు.
Delhi Metro : ఢిల్లీ మెట్రో డ్రైవర్ చేసిన పని వైరల్.. అనౌన్స్‌మెంట్‌కి బదులు!
జనరల్ గా చాలామంది టీతో పాటు స్నాక్స్(snacks) లో సమోస తినడానికి చాలా ఇష్టపడతారు. ఇక చికెన్ బిర్యానీ అంటే పడి చచ్చిపోయే వారు ఉన్నారు. వేటికవే అద్భుతమైన వంటకాలు కావడంతో ఈ ‘బిర్యాని సమోస’ పేరుతో వాటిపై ఉన్న ఇష్టాన్ని పోగొట్టవద్దని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఈ వంటకం కనిపెట్టిన మహానుభావుడు ఎవరో? కానీ ఈ వంటకం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో బోల్డు వ్యూస్ సంపాదించుకుంటోంది.
presenting biryani samosa pic.twitter.com/i5wBCrNF7Y
— ghalib e wosta (@khansaamaa) March 26, 2023
