Cheetah: నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. తల్లీ, పిల్లలు క్షేమం.. వైరల్ వీడియో

సియాయా అనే మూడేళ్ల చీతా ఈ పిల్లలకు ఐదు రోజుల క్రితం జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఎనిమిది చీతాల్ని ఇండియాలో ప్రవేశపెట్టారు.

Cheetah: నాలుగు పిల్లలకు జన్మనిచ్చిన నమీబియా చీతా.. తల్లీ, పిల్లలు క్షేమం.. వైరల్ వీడియో

Cheetah: గత ఏడాది నమీబియా నుంచి ఇండియా తీసుకొచ్చిన చీతాల్లో ఒక చీతా తాజాగా నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది. నాలుగు పిల్లలు ప్రస్తుతం సురక్షితంగా ఉన్నాయని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ వెల్లడించారు. మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్ పార్కులో ఈ చీతాలు జన్మించాయి.

Bhadradri: భద్రాద్రిలో రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి.. సీఎం కేసీఆర్ హాజరుపై సందిగ్ధత

సియాయా అనే మూడేళ్ల చీతా ఈ పిల్లలకు ఐదు రోజుల క్రితం జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీ, పిల్లలు క్షేమంగా ఉన్నాయి. ప్రాజెక్టు చీతాలో భాగంగా చీతాల్ని నమీబియా నుంచి ఇండియా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 17న నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా ఎనిమిది చీతాల్ని ఇండియాలో ప్రవేశపెట్టారు. వీటిలో ఒక చీతా ఇటీవలే అనారోగ్యం కారణంగా మరణించింది. ఈ ఘటన మరువక ముందే మరో చీతా నాలుగు పిల్లలకు జన్మనిచ్చిందనే శుభవార్త తెలిసింది. అధికారులకు ఐదు రోజుల నుంచి సియాయా అనే చీతా బయట కనిపించలేదు. దాని మెడకు ఉన్న శాటిలైట్ కాలర్ ద్వారా అధికారులు ఈ చీతా ఉన్న ప్రాంతాన్ని గుర్తించారు.

అక్కడికి వెళ్లి పరిశీలించగా చీతాలు జన్మించినట్లు గుర్తించారు. సాధారణంగా చీతాలు పిల్లలకు జన్మనివ్వాలంటే అక్కడి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటేనే అవి పిల్లల్ని కంటాయి. అందువల్ల ప్రస్తుతం చీతాలు ఉన్న ప్రదేశానికి అధికారులు ఎవరూ వెళ్లడం లేదు. తల్లిని, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం లేదు. సురక్షితమైన ప్రదేశంలో, పూర్తి భద్రత మధ్య అవి ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆశా అనే మరో చీతా కూడా గర్భంతో ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.