కట్ చేయకుండానే : మాజీ సీఎం బర్త్‌డే కేక్ మాయం

మాజీ సీఎం మాయావతి పుట్టినరోజు కేక్ ను ఎగబడి మరీ తినేసారు.కట్ చేయకుండా కేక్ పై దాడి చేసిన కార్యకర్తలు అందినకాడి లాగేసుకుని మరీ తినేసారు.

  • Publish Date - January 16, 2019 / 04:22 AM IST

మాజీ సీఎం మాయావతి పుట్టినరోజు కేక్ ను ఎగబడి మరీ తినేసారు.కట్ చేయకుండా కేక్ పై దాడి చేసిన కార్యకర్తలు అందినకాడి లాగేసుకుని మరీ తినేసారు.

ఉత్తరప్రదేశ్: మాజీ సీఎం, బీఎస్పీ చీఫ్ మాయావతి 63వ పుట్టిన రోజు(2019, జనవరి 15వ తేదీ) వేడుకలు రసాభాసగా మారాయి. మాయావతి బర్డే కావడంతో రాజధానికి 420 కిమీల దూరంలో వున్న అమ్రోహాలో భారీ ఏర్పాట్లు చేశారు. భారీ కేక్ ఆర్డర్ చేశారు. పుట్టినరోజు అతిథులు రాగానే కేక్ కట్ చేసేందుకు అంతా రెడీగా వున్నారు. ఇంతలోనే జరగాల్సిందంతా జరిగిపోయింది. కేకును చూడగానే కార్యకర్తలకు నోరు ఊరిందో ఏమో.. అమాంతంగా కేకుపై ‘దాడి’ చేశారు. చాకు అవసరం లేకుండానే ఎవరికి అందినంత వారు లాగేసుకుని తినేసారు. చివరికి, ఒకరిపై ఒకరు కలబడుతూ.. క్షణాల్లో ఆ కేకును ‘మాయం’ చేశారు.

వేదికపై ఉన్న పెద్దలు మైకుల్లో మొత్తుకుంటున్నా.. పట్టించుకోలేదు..అరిచి గీపెట్టినా ఖాతరు చేయలేదు. ఎవరికి వారు చేతులతో కేకును లాక్కోవడంతో అదికాస్తా చితికిపోయి నుజ్జు నుజ్జుగా అయిపోయినా వదల్లేదు. క్షణాల్లోనే కేక్‌ను ఖాళీ చేసిన తరువాత బర్త్ డే వేడుకలు జరిగేంతవరకూ కూడా లేకుండా వెళ్లిపోయారు. ఈ వీడియాలో వైరల్‌గా మారింది.