5 ఏళ్ల చిన్నారిపై కుక్క దాడి

  • Publish Date - February 21, 2020 / 07:41 AM IST

అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ టౌన్ లో రోడ్డుపై నడుస్తున్న 5ఏళ్ల చిన్నారిపై ఓ కుక్క ఎగబడింది. అసలు అది ఆ చిన్నరిపైనే ఎందుకు ఎటాక్ చేసిందో తెలియదు కానీ, నేరుగా వచ్చి పక్కనున్న ఎవరిని ఏం చేయకుండా.. డైరెక్ట్ గా చిన్నరి మీదనే దూకి తీవ్రంగా గాయపర్చింది. పకనున్న వారు వదిలించడానికి ఎంత ట్రై చేసిన చాలాసేపటివరకు వదల్లేదు. 

అప్పుడే చర్చిలో నుంచి తన బంధువులతో బయటకు వచ్చింది. కార్ వైపుగా నడుస్తుంటే.. సడెన్గా కుక్క వచ్చి చిన్నారి మీదకు ఎక్కేసింది. వెంటనే కుక్క బారినుంచి చిన్నారిని కాపాడే ప్రయత్నం చేశారు. వారితో పాటు అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కూడా సహాయం చేశారు. తనను వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అదృష్టవశాత్తూ.. ఆ చిన్నారికి ఏం జరగలేదు.

ఇదంతా అక్కడ పార్కింగ్‌ ఏరియాలో ఉన్న సీసీ టీవీ ఫూటేజ్ లో రికార్డ్ అయింది. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలను హ్యూమన్‌ సొసైటీ తమ ఫేస్‌బుక్‌ ఖాతాలో ఉంచింది. దీంతో వీడియో కాస్తా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్‌గా మారింది.