మనుషులు వాలీబాల్ ఆడడం ఎప్పుడు చూస్తూనే ఉంటాం. కానీ కుక్కలు వాలిబాల్ ఆడటం ఎప్పుడైనా చూసారా..? అయితే ఇప్పుడు చూడండి. నార్వేలోని బీచ్ పక్కనే వాలి బాల్ గేమ్ కోర్టు ఉంది. అక్కడికి వాలీబాల్ ఆడడానికి కొంతమంది ప్లేయర్స్ వచ్చారు. వారితో పాటు కియారా అనే డాగ్ ని కూడా తీసుకువచ్చారు.
అయితే వాళ్లు గేమ్ స్టార్ట్ చేసి ఆడుతుండగా… నేను ఆడుతాను అంటూ వెళ్ళి ఆ కుక్క తలతో ఒకే ఒక్క షార్ట్ కొట్టింది. అంతే అక్కడున్న ప్లేయర్స్ అంతా ఆశ్చర్యపోయారు. అనంతరం దాన్ని కూడా ఆట లో జాయిన్ చేసుకున్నారు.
అంతేకాదండోయ్… ఈ కియారా కు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. కియారా కు ఈ ఒక్క వారంలోనే 18 వేల ఫాలోవర్స్ వచ్చారు. ప్రస్తుతం డాగ్ వాలీబాల్ గేమ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read | Breaking News : రెడ్ జిల్లాగా చిత్తూరు