రక్తదానం చేసి ఓ ప్రాణాన్ని కాపాడొచ్చనే సంగతి అందరికీ తెలుసు. మనుషుల్లో రక్త బదిలీ జరిగినట్లు కుక్కల్లో, పిల్లుల్లోనూ చేయొచ్చంట. ఈ విషయం తెలియక జంతు ప్రేమికులు ఎందరో వారి కుక్కలు, పిల్లుల ప్రాణాలు కోల్పోతున్నారు. అనీమియా లాంటి వ్యాధులు, కార్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తీవ్ర గాయాలకు గురై పెంపుడు జంతువులు చనిపోతుంటాయి.
వారికి అవగాహన లేకనే వాటిని కోల్పోతున్నారని నిజానికి కుక్కలు, పిల్లులు కూడా రక్తదానం చేయొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. డా.కరెన్ హమ్(రాయల్ వెటర్నర్ కాలేజీ, యూకే) మాట్లాడుతూ.. ‘పెంపుడు జంతువుల యజమానులు వారి జంతువులను ఎంతగానో ప్రేమిస్తారు. ఇతరుల జంతువులకు సాయం చేసేందుకు సిద్ధంగానే ఉంటారు. రక్తదానం చేస్తే ఇతర జంతువులకు ఎంతసాయం చేయగలమో వారికి తెలుసు’ అని వెల్లడించారు.
జంతువులు తమంతట తామే రక్తదానానికి రాలేవని, వాటి యజమానులే పశువుల రక్తదానంపై అవగాహన ఏర్పరచుకుని ముందుకు రావాలని బ్లడ్ డొనేట్ క్యాంపులు పిలుపునిస్తున్నాయి. మనుషుల్లానే రక్తదానం చేస్తే మరింత వేగంగా శరీరానికి రక్తం సమకూరుతుందని పరిశోధకులు చెప్పుకొస్తున్నారు.