Elephant guides: అంధ ఏనుగుకు తన కళ్లతో లోకం చూపిస్తున్న తోటి ఏనుగు.. మనసులు గెలిచిన వీడియో

ఏనుగుల ఐకమత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతలా అంటే ప్రమాదం ముంచుకొస్తున్నా కలిసి పోరాడతాయి. కలిసే బతుకుతాయి. అలాంటిది తమ తోటి ఏనుగుకు అంధత్వం వచ్చిందని వదిలేస్తాయా..

Elephant guides: ఏనుగుల ఐకమత్యం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎంతలా అంటే ప్రమాదం ముంచుకొస్తున్నా కలిసి పోరాడతాయి. కలిసే బతుకుతాయి. అలాంటిది తమ తోటి ఏనుగుకు అంధత్వం వచ్చిందని వదిలేస్తాయా.. ఇదిగో ఇలా ప్రతి విషయంలో దానికి తోడుంటూ ఆహారాన్ని ఎలా అందిస్తున్నాయో చూడండి.

ఈ వీడియోను జంతు ప్రేమికులు ఎవరూ మిస్ కారేమో. తోటి ఏనుగు కళ్లతో చూసి ఆహారం అందుకుంటుంది. వీడియోలో చూస్తే ఆహారానికి దూరంగా నిల్చొన్న ఏనుగుపై కేరింగ్ తీసుకుంటూ దగ్గరకు లాక్కొచ్చి తినిపిస్తుంది. ఏనుగుల్లో ఉన్న అద్భుతమైన కోణాన్ని రోజు చూస్తుంటాం. ఇలాంటి లవ్, కేర్ ఒకదాని పట్ల మరొకటి హద్దుల్లేకుండా చూపిస్తుంటాయి. ఇవి మనకు చాలా పాఠాలు నేర్పుతాయి కూడా’ అంటూ లెక్ ఛైర్లెట్ ఇన్ స్టాలో వీడియోను పోస్టు చేశారు.

ఈ వీడియోను ఎలిఫెంట్ నేచర్ పార్క్ రికార్డ్ చేసింది. థాయ్‌లాండ్‍‌లోని ఎలిఫెంట్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ లోని వీడియో ఇది. ఆ రెండింటి మధ్య ఉన్న ఆప్యాయతను ఇంటర్నెట్ గెలుచుకుంది.

ట్రెండింగ్ వార్తలు