మిస్ యూ బాస్.. యజమానికి హగ్ ఇచ్చిన ఒంటె: వీడియో వైరల్

  • Publish Date - December 28, 2019 / 09:02 AM IST

మనుషుల కంటే జంతువులకు చాలా విశ్వాసం ఉంటుంది. వాటికి రోజు తిండి పెటే యజమానుల కోసం ప్రాణాలను సైతం త్యాగం చేస్తాయి. కేవలం కుక్కలకు మాత్రమే ప్రేమ, విశ్వాసం చూపిస్తాయని అనుకుంటే పొరపాటే. ఇదిగో ఇలాంటి జీవులకు కూడా తమ యజమానులపై ప్రేమ ఉంటుంది. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్‌లో పోస్టు చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఒంటెలను కాసే ఓ వ్యక్తి కొద్ది రోజులు ఊరెళ్లి.. తిరిగి రాగానే ఒంటె దగ్గరకు వెళ్లాడు. అంతే వెంటనే ఆ ఒంటె తన పొడవైన మెడతో యజమానిని కౌగిలించుకుని తన ప్రేమను వ్యక్తం చేసిందని పేర్కొన్నారు.

ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఒంటె ప్రేమకు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఈ వీడియో చూసిన ప్రతీఒక్కరు.. వండర్ ఫుల్ డే సార్, అమెజింగ్ అంటూ ఎవరికి నచ్చినట్టు వారు స్పందించారు.