టిక్ టాక్ పిచ్చి.. యువతితో పారిపోయిన వివాహిత

  • Publish Date - December 14, 2019 / 05:18 AM IST

టిక్ టాక్… సోషల్ మీడియాలో ప్రస్తుతం ఇదే క్రేజీ యాప్. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ పిచ్చపిచ్చిగా ఈ యాప్ ను వాడేస్తున్నారు. అయితే ఇలా టిక్ టాక్ వీడియోలకు బానిసైన ఓ యువతి ఏం చేసిందో తెలుసా..? టిక్ టాక్ వీడియోలకు అలవాటు పడి తన కుటుంబాన్నే రోడ్డున పడేసింది. 

కర్నూల్ జిల్లా కిలిచినపేటకు చెందిన ఓ మహిళ చెల్లెలిని బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి పెళ్ళి చేసింది. అతను బెంగళూరులోనే పెట్రోలు బంక్‌లో పనిచేస్తున్నాడు. అదే బంకులో పనిచేస్తున్న ఓ యువతిని అతను తన భార్యకు పరిచయం చేశాడు భర్త. ఆ పరిచయం కాస్తా.. ఎక్కడికో పోయింది. టిక్‌ టాక్‌లో వీడియోల దాకా సాగింది. ఒకరిని వదిలి మరొకరు ఉండలేనంత ప్రేమ వారిద్దరి మధ్య ఏర్పడింది.

అలా పెట్రోల్ బంక్ యువతి, వివాహిత మహిళ కలిసి టిక్ టాక్ లో కొన్ని వీడియోలు, స్కిట్‌ లు చేశారు. ఈ క్రమంలోనే నెల రోజుల క్రితం భర్తతో గొడవ పడి బయటకు వచ్చేసింది. అయితే ఇంట్లో చెప్పకుండా పిల్లల్ని వెంటబెట్టుకుని ఎక్కడికి వెళ్లిపోయిందని. ఆమె భర్త, తల్లిదండ్రులు, బంధువులు తెలిసిన చోట్లు మొత్తం వెతికారు. కానీ ఆ మహిళ ఆచూకీ తెలియలేదు. చివరికి యువతి తల్లిదండ్రులు దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌ కు వెళ్లి గురువారం (డిసెంబర్ 12, 2019) ఫిర్యాదు చేశారు. దీంతో వివాహిత ఆచూకీ దొరిగిందని బెంగళూరులోనే ఉందని పోలీసులు తెలిపారు.