బెర్లిన్ గోడ కూల్చివేతపై.. గూగుల్ స్పెషల్ డూడుల్

  • Publish Date - November 9, 2019 / 04:57 AM IST

గూగుల్ శనివారం (నవంబర్ 9, 2019) బెర్లిన్ గోడ కూల్చివేతపై 30వ సంవత్సరాన్ని డూడుల్ తో సెలబ్రేట్ చేసుకుంటుంది. బెర్లిన్ కు చెందిన గెస్ట్ ఆర్టిస్ట్ మాక్స్ గుథర్ సృష్టించిన డూడుల్. ఇందులో ఒక పురుషుడు, స్త్రీ హగ్ చేసుకుని కూలిన గోడ దగ్గర ఉన్నట్లు చూపిస్తోంది. మరి అసలు ఈ బెర్లిన్ గోడకు వెనుక ఏం జరిగింది.. ఏందుకు ఆ గోడను కూలగొట్టారు.. ఆ తర్వాత అక్కడి ప్రజలు ఏం చేశారనే విషయం తెలుసుకుందాం.

తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరుచేసిన గోడ ఇది. 1949-1961 మధ్య 25 లక్షల మందికి పైగా ప్రజలు మెరుగైన అవకాశాల కోసం తూర్పు జర్మనీని వదిలి పశ్చిమ జర్మనీకి వచ్చేశారు. దీంతో తూర్పు జర్మనీ నుంచి ఈ వలసలను అడ్డుకొనేందుకు బెర్లిన్ గోడ నిర్మించాలని కమ్యూనిస్టు రూలర్స్ ఆదేశించారు. 1961 ఆగస్టు 13 రాత్రి కొన్ని గంటల్లోనే బెర్లిన్ గోడను నిలబెట్టారు.

ఈ గోడ మూడున్నర మీటర్లకు పైగా ఎత్తుంటుంది. గోడను స్టీలు కేబుళ్లు వాడి చాలా గట్టిగా నిర్మించారు. తూర్పు బెర్లిన్ వాసులు 5 వేల మందికి పైగా తప్పించుకొని పశ్చిమ బెర్లిన్ చేరుకున్నారు. కానీ సరిహద్దులో చాలా మంది అరెస్టయ్యారు.. కొంతమంది చనిపోయారు. తూర్పు, పశ్చిమ జర్మనీలను వేరుచేసిన బెర్లిన్ గోడ పతనం ఇరవయ్యో శతాబ్దపు కీలక ఘట్టాల్లో ఒకటి.