అదృష్టం బాగుంది: చిరుత నుంచి తృట్టిలో తప్పించుకున్నారు

  • Publish Date - November 16, 2019 / 07:48 AM IST

ఓ అడవిప్రాంతంలో చిరుత పులి నుంచి బైక్ పై వెళ్తున్న ఓ ఇద్దరు వ్యక్తులు తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒడిశాకు చెందిన IFS అధికారి సుశాంత నందా తన ట్విట్టర్ ద్వారా పోస్టు చేశాడు.

రాత్రి సమయంలో అడవి ప్రాంతంలో.. చీకట్లో దాక్కుని ఉన్న చిరుత బైక్ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను చూసి వెంటనే వారి మీదకు పరిగెత్తుకు వచ్చింది, కానీ వారు చిరుతను చూసిన వెంటనే బైక్ ఫాస్ట్ చేయడంతో తృట్టిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఇదంతా అక్కడే కార్ లో ఉన్న వ్యక్తులేవరో వీడియో తీశారు.

అయితే వారిపై దాడి చేసి.. మిస్ అయిన చిరుత వెంటనే అడవిలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  దీనిపై ట్విట్టర్ యూజర్లు కామెంట్లు పెడుతున్నారు.