Lion in Tent: నిద్ర లేవగానే సింహం టెంట్‌లోకి వచ్చి ఉంటే..

వైల్డ్ లైఫ్ ను దగ్గరగా చూడాలని ఇంట్రస్ట్ చాలా మందికి ఉండొచ్చు. కానీ, నిద్రలేచి చూడగానే సింహం కళ్ల ముందు ఉంటే మీ రియాక్షన్ ఏంటి?.. దక్షిణాఫ్రికాలోని బొస్వానాలో వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఆ జంటకు ఇదే షాక్ తగిలింది.

Lion Just Woke Up

Lion in Tent: వైల్డ్ లైఫ్ ను దగ్గరగా చూడాలని ఇంట్రస్ట్ చాలా మందికి ఉండొచ్చు. కానీ, నిద్రలేచి చూడగానే సింహం కళ్ల ముందు ఉంటే మీ రియాక్షన్ ఏంటి?.. దక్షిణాఫ్రికాలోని బొస్వానాలో వైల్డ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఆ జంటకు ఇదే షాక్ తగిలింది.

ఆ ఘటన కెమెరాలో రికార్డ్ అవడంతో వైరల్ గా మారింది. సింహం చూడగానే కార్ స్టార్ట్ చేసి పరారయ్యారు. ‘సరిగ్గా అప్పుడు సమయం ఉదయం 6గంటలు అవుతుంది. మేం బ్రష్ చేసుకుని కాఫీ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అప్పుడే మా తల వైపు నుంచి సింహం నడుచుకుంటూ వస్తుంది.

lion in tesnt

అంతే టెంట్ లో వాళ్లకు కావాల్సినవి ఏం ఉన్నాయా అని కూడా చూడలేదు. యాండీ ఆమె చేత్తే పట్టుకుని ఉన్న దిండును దూరంగా విసిరికొట్టి పరుగులు తీసింది. ఈ లోపు ఆమె బాయ్ ఫ్రెండ్ కార్ స్టార్ చేయడంతో వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోగలిగారు. కారు ఎక్కి వీడియో రికార్డ్ చేశారు.

సింహం టెంట్ చుట్టూ చక్కర్లు కొట్టడం, లోపలికి వెళ్లి ఒక దిండును తీసుకుని బయటకు రావడం అందులో రికార్డ్ అయ్యాయి. అలా కాసేపటి వరకూ తిరిగి టెంట్ వదిలి వెళ్లిందని గమనించిన తర్వాతే అక్కడికి వచ్చారు. అదెటువంటి రచ్ఛ చేయకుండా వచ్చి చూసి వెళ్లిపోయిందట. కుర్చీని తన్ని పొదల్లోకి వెళ్లిపోయిందని ఆ షాక్ నుంచి తేరుకోవడానికి కొద్ది గంటల సమయం పట్టిందని చెబుతున్నారు.