పులి పంజా విసిరితే సింహం బెదిరింది

  • Publish Date - December 30, 2019 / 07:46 AM IST

సింహం, పులి మధ్య ఫైటింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను భారత అటవీ శాఖ అధికారి సుశాంత్ నందా ఆదివారం (డిసెంబర్ 29,2019) రోజున ట్విట్టర్ లో షేర్ చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళ్లితే ఒక గడ్డి మైదానంలో పులి విశ్రాంతి తీసుకుంటుంది. ఆ సమయంలో సింహాలు, ఇతర జంతువులు అక్కడే తిరుగుతున్నాయి. సింహలలో ఒక సింహం మాత్రం తన బలంతో పులి పై ఫైటింగ్ చేయాలనుకుంది. 

సింహం పులి మెడపై కోరకటంతో పులి ఒకసారిగా తన పంజాతో సింహం ముఖం పై కొట్టింది. దాంతో సింహం దూరంగా వెళ్లిపోయింది. పులి పంజా విసరడంలో ఒక బాక్సర్ లాగా ఉందని సుశాంత్ అన్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్ల మాత్రం సింహం ఎప్పుడు ఓటమిని అంగీకరించదు, చనిపోయే వరకు పోరాడుతుందని కామెంట్స్ చేస్తున్నారు.