సాధారణంగా కోతి, కుక్క, పిల్లి, చిలుక వంటి జంతువులే పెంచుకునే వారి మాటలు వింటాయి, చెప్పిన పని చేస్తాయి. కానీ తాజాగా తిమింగలం కూడా ఈ కోవలోకి చేరిపోయిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కొంతమంది వ్యక్తులు బెలుగా అనే తిమింగలంతో ఆడిన బంతి ఆటను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో షేర్ చేస్తూ.. ప్లాస్టిక్ వాడకాన్ని ఆపేయాలని కోరారు. సముద్రంలో ప్లాస్టిక్‌ను పారవేయడం నీటిలో నివసించే జంతువులకు చాలా ప్రమాదకరంగా మారిందని తెలిపారు.
జెమిని క్రాఫ్ట్ అనే వ్యక్తి తన స్నేహితులతో కలిసి ఆర్కిటిక్ పోలార్ కు టూర్ కు వెళ్లాడు. అయితే అక్కడ బోటులో ప్రయాణిస్తున్న సమయంలో బెలుగా తిమింగలం వచ్చింది. దాంతో కాసేపు సరదాగా రగ్బీ ఆట ఆడారు. వారు బంతిని నీళ్లలోకి విసురుతుంటే బెలుగా.. తిరిగి దానిని వాళ్లకు తెచ్చి ఇస్తుంది.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 4 మిలియన్లకు పైగా లైకులు ఈ వీడియోకు వచ్చాయి, ఈ వీడియో చూసిన నెటిజన్లు తిమింగలంతో బంతి ఆట.. భలే సరదాగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు
This man is playing fetch with a Beluga Whale. This is INCREDIBLE. ❤️
We honestly don’t deserve these Majestic Creatures. ?
Protect them at all costs.
PLEASE STOP USING PLASTIC pic.twitter.com/LpqqS4V7jI
— StanceGrounded (@_SJPeace_) November 7, 2019