వైరల్ : దొంగతో ఫైట్ చేస్తూ మహేష్ బాబులా… దెబ్బకు గోడపగలగొట్టాడు

  • Publish Date - March 17, 2020 / 04:58 AM IST

మహేష్ బాబు ‘అతడు’ సినిమాలో గోడ పగలగొట్టిన సీన్ అందరికి గుర్తుండే ఉంటుంది. అలాంటిదే తాజాగా ఇంగ్లాండ్ లో దొంగతనం చేసిన వ్యక్తి పట్టుకుని కొడుతున్నప్పుడు గోడ విరిగిపడింది. ప్రస్తుతం ఈ  వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

వివరాల్లోకి వెళ్తే.. ఇంగ్లాండ్ లోని గ్రేటర్ మాంచెస్టర్ లోని సిప్రెస్ రోడ్డులో ఇద్దరు వ్యక్తులు ముఖానికి తెల్లని మాస్కులు, నల్లరంగు కోటు ధరించి కారును దొంగిలించారు. ఆ కారు యజమాని నుంచి తప్పించుకోనేందుకు కారును వేగంగా నడిపుతు మరో కారును ఢీ కొట్టారు. దాంతో వెంటనే కారు దిగి పరుగులు పెట్టారు. 

అయితే వారిలో ఒక వ్యక్తి కారులో ఏదో మరిచి పోవటంతో మళ్లీ వెనక్కి తిరిగివచ్చాడు. ఇదంతా అటువైపుగా వెళ్తున్న ఓ బాటసారి గమనించి ఆ దొంగను పట్టుకునే ప్రయత్నం చేశాడు. ఆ దొంగ పరిగెతున్నప్పుడు అతనికి అడ్డంగా వెళ్లి పట్టుకుని గట్టిగా ఒక దెబ్బ కొడతాడు. ఆ దెబ్బకు దొంగ పక్కనే ఉన్నఇటుకుల గోడకు ఉన్న పిల్లర్ కు గుద్దుకుంటాడు. దాంతో పిల్లర్ విరిగి కింద పడిపోయింది.

ఈ వీడియోని @Deano60471958 అనే ట్విట్టర్ యూజర్ ‘A bit of British justice’ అనే క్యాప్షన్ తో షేర్ చేస్తాడు. ఆ వీడియోని ఇప్పటివరకు 1.3 మిలియన్లకు పైగా వీక్షించారు.