ఈ సైకిల్ తొక్కాలంటే.. చాలా ధైర్యం ఉండాలి

  • Publish Date - December 7, 2019 / 09:04 AM IST

సైకిలింగ్ అంటే ఇష్టం ఉన్నవాళ్లు చాలామంది ఉంటారు. అయితే చిన్నచిన్న సైకిల్లను నడపడం ఎవరికైనా సాధ్యమే.. కానీ మీరు ఎప్పుడు ఇలాంటి సైకిల్ తొక్కి ఉండరు. ఎందుకంటే ఈ సైకిల్ అన్నీటిలా కాదు. ఈ సైకిల్ ఎక్కాలంటే తప్పకుండా మీకు ధైర్యం ఉండాలి. ఎందుకంటే.. ఇది అత్యంత పొడవైన సైకిల్.

ఈ సైకిల్ సుమారు 15 అడుగుల ఎత్తు ఉంటుంది. దీని చక్రాలు భూమి మీద ఉంటే.. హ్యాండిల్ మాత్రం ఎక్కడో ఆకాశంలో ఉంటుంది. అయితే, ఎవరికీ అంత పెద్ద పొడవైన కాళ్లు ఉండవు కాబట్టి.. పెడల్‌ను కూడా అందుబాటు ఎత్తులోనే పెట్టాడు. అది ఎక్కలంటే మనవల్ల కాదు.. కానీ ఈ వీడియోలో ఉన్న ఓ యువకుడు సైకిల్‌ను ముందుకు తోస్తూ.. నిచ్చెన ఎక్కినంత సులభంగా సైకిల్ పైకి ఎక్కేశాడు. అంతేకాదు రన్నింగ్‌లో ఉండగానే సైకిల్ మీద నుంచి దిగిపోయాడు.

అయితే ఇదంతా ఓ ట్విట్టర్ యూజర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో అది క్షణాల్లో వైరల్ అయ్యింది. అంత ఎత్తు సైకిల్ తయారు చేయడమే గొప్ప అనుకుంటే.. ఆ యువకుడు సైకిల్ తొక్కే విధానం ఇంకా గ్రేట్. అంతేకాదు ఈ వీడియోకి ఇది 38వేల రీట్వీట్లు, 31వేల పైగా లైక్‌ లను కూడా సంపాదించింది.