న్యూయార్క్ కరోనా బాధితుల కోసం అట్లాంటా వైద్య బృందం

  • Publish Date - March 30, 2020 / 11:08 AM IST

అగ్రరాజ్యమైన అమెరికా కరోనా దెబ్బకు వణికిపోతుంది. కరోనా వైరస్ సోకి వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీని ప్రభావం న్యూయార్క్ సిటీలో ఎక్కువగా ఉంది. న్యూయార్క్ లో కరోనా బాధితులకు,కరోనాను కట్టడి చేసేందుకు సహాయం చేయటానికి జార్జియా నుంచి అక్కడికి వెళ్తున్న ఆరోగ్య నిపుణుల బృందం ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ ఫోటోలో కొంతమంది వ్యక్తులు చేతులకు ముసుగులు తొడిగి, లవ్ సింబ్లల్ ఆకారంలో  చేతుల పట్టుకున్నట్లుగా కనిపిస్తుంది. ఈ ఫోటోను ఫేస్ బుక్, ట్విట్టర్ లో 10వేల మందికి పైగా షేర్ చేశారు. తీవ్రమైన కరోనా వైరస్ సమయంలో డాక్టర్లు చూపుతున్న ధైర్యంపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురుపిస్తున్నారు.
 
కోవిడ్ 19 మహమ్మారి ప్రభావం ఎక్కువౌతున్న సమయంలో ఇతరుల అవసరాలను తమ సొంతం అవసరాల కంటే ఎక్కువగా భావించారంటూ సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. వారి నిస్వార్ధ త్యాగం వల్ల ప్రపంచంలో చీకటి తొలిగించి, వెలుగులు నింపటానికి వచ్చిన వారికి కృతజ్ఞతలు. వారిని ఎంత ప్రశంసించిన సరిపోదు అని ట్వీట్ చేసింది.

అట్లాంట్ విమానశ్రయం నుంచి బయలు దేరటానికి ముందు ఆరోగ్య నిపుణుల బృందాన్ని విమాన సిబ్బంది ఫోటో తీసినట్లు సౌత్ వెస్ట్ ఎయిర్ లైన్స్ ప్రతినిధి డైరెక్టర్ కె.హబ్బర్ తెలిపారు. మెుత్తం 30 మంది నిపుణులతో కూడిన బృందం ఉందని తెలిపారు.

Also Read |  లోకల్ ట్రాన్స్ మిషన్ దశలో ఉన్నాం…కరోనాపై కేంద్రం క్లారిటీ

ట్రెండింగ్ వార్తలు