పసిపిల్లలు దేవుడుతో సమానం అంటుంటారు. అలాంటిది వారు ఏం చేసినా సరే.. చూడటానికి చాలా ఫన్నీ ఉంటుంది. వారు చేసే పనులైనా, అల్లరైనా ప్రతిదీ క్యూట్ గా ఉంటాయి. తెలిసి తెలియని పసితనంతో చేసే ప్రతిదీ మనకు నవ్వు తెప్పిస్తుంటాయి. ప్రస్తుతం చిన్నపిల్లలు ఎటువంటి పనులు చేసిన సరే… అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతున్నాయి.
తాజాగా ఒక పాప.. తన తల్లితో కలిసి చర్చికి వెళ్లింది. అక్కడ ఫాదర్ తనకు ఆశీర్వాదం కోసం చేతిని పైకి ఎక్కితే…. తనకు హై ఫై ఇస్తున్నాడేమో అనుకుని చేతితో ఆయన చేతిని తాకింది. ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఈ వీడియోలో పాపను ఆశీర్వాదించటం కోసం ఫాదర్ చేయి పైకెత్తాడు. దీంతో పాప తనకు హై ఫై ఇస్తున్నాడని తన చేతితో పాప చేతిని టచ్ చేసింది. పాప అమాయకత్వాన్ని చూసి ఫాదర్ నవ్వును ఆపుకోలేక పోయింది స్పష్టంగా వీడియోలో కనిపిస్తుంది. ఈ వీడియోని ప్రముఖ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘ఈరోజు మీరు చూస్తున్న గొప్ప విషయం … పిల్లల అమాయకత్వం..’ అనే క్యాప్షన్ తో పంచుకున్నాడు.
ఇప్పటివరకు ఈ వీడియోని 22 లక్షల మందికి పైగా వీక్షించారు. 30వేలకు పైగా లైకులు వచ్చాయి. 5వేలకు పైగా రీట్వీట్ చేయబడింది. ప్రస్తుతం కొంతమంది నెటిజన్లు సో క్యూట్ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంతమంది తమ పిల్లలు ఇలాగే చేశారంటూ రీట్వీట్ చేస్తున్నారు.
Father is saying a blessing.
The innocence of a child.
They’re trying not to laugh.
Best thing you’ll see today… pic.twitter.com/8ueI8JLhnf
— Rex Chapman?? (@RexChapman) October 21, 2020