OMG వీడియో : కార్లు నడిపేస్తున్న ఎలుకలు..!!

  • Publish Date - October 28, 2019 / 03:55 AM IST

కారు నడపటంలో అందరికీ రాదు..కానీ ఎలుకలు మాత్రం కార్లను నడిపేస్తున్నాయి..!. ఏంటీ తమాషాగా ఉందా? మా చెవిలో ఏమన్నా కాలిఫ్లవర్స్ కనిపిస్తున్నాయా? అనుకుంటున్నారు కదూ..కానే కాదు..నిజమంటే నిజ్జంగా ఎలుకలు కార్లు నడిపేస్తున్నాయి. వార్నీ..ఎలుకలు పాటి చేయలేకపోతున్నామా మనం అంటూ కారు డ్రైవింగ్ రానివారు ముక్కు మీద వేలేసుకుంటున్నారు. లోకంలో వింతలు విచిత్రాలకు కొదవలేదు.  అటువంటి వింతే ఎలుకలు కార్లను డ్రైవ్ చేయటం..మరి ఆ వింత తెలుసుకుందాం..

అమెరికా వర్జినియాలో ఉన్న రిచ్మండ్ యూనివర్శిటీ పరిశోధకులు ఎలుకల కోసం స్పెషల్  కార్లను తయారు చేశారు. మనుషులే కాదు..ఎలుకలు కూడా కార్లను నడపగలవని నిరూపించారు.

సైంటిస్టులు తయారు చేసిని ఈ ప్రత్యేక కార్లకు ఓ  గాజు డబ్బాను అమర్చారు. ఒక పక్క ఎలుకలకు ఇష్టమైన ఆహారాన్ని పెట్టారు. కారులో నుంచి బయటకు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎలుకలు తప్పకుండా కారు నడపాలి. ఆ కారును నడపాలంటే ఎలుకలు తన తెలివి తేటలను ఉపయోగించితేనే ఆహారం దొరుకుతుంది. 

సైటిస్టుల ఆలోచన ఫలించింది. ఎలుకలు కారును నడిపాయి. ఆహారం వద్దకు చేరేందుకు అవి ఆ కార్లను డ్రైవ్ చేసుకుంటూ వెళ్లాయి.  తమకు నచ్చిన ఆహారాన్ని విజయవంతంగా తిన్నాయి. సైంటిస్టులు 11 మగ, 6 ఆడ ఎలుకలపై ఈ ప్రయోగం చేశారు. ఎలుకలు కార్లు నడిపిన ఈ వీడియోను మీరు కూడా చూడండి…