కరోనా ను ఓడించి ఇంటికి తిరిగి వచ్చిన అక్కకు తీన్మార్ స్టెప్పులతో స్వాగతం పలికిన చెల్లి

  • Publish Date - July 21, 2020 / 02:54 PM IST

కరోనా వైరస్ మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోతుంది. దేశవ్యాప్తంగా రోజురోజుకు కేసులు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో కరోనాను జయించి ఇంటికి తిరిగి వచ్చిన వారు ఉన్నారు. తాజాగా కరోనాను జయించి ఇంటికి తిరిగివచ్చిన ఓ యువతికి కుటుంబ సభ్యులు డప్పులతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ ఘటన పుణెలో వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

కోవిడ్ ని జయించి ఇంటికి తిరిగివచ్చిన మహిళకు ఘనంగా స్వాగతం పలికారు. కోవిడ్‌ చికిత్సలో భాగంగా ఇన్నాళ్లూ ఇంటికి దూరమైన సోదరిని చూసి ఆమె చెల్లెలు రెచ్చిపోయింది. వీధిలోకి తన అక్క ఎంటరైన దగ్గర నుంచే తీన్మార్‌ స్టెప్పులతో ఆనందాన్ని వ్యక్తం చేసింది. చెల్లెలి ఉత్సాహంతో పొంగిపోయిన అక్క కూడా డ్యాన్స్‌ చేసింది. కోవిడ్‌ను జయించిన కుమార్తెకు తల్లిదండ్రులు హారతి ఇచ్చి ఇంట్లోకి సాదరంగా తీసుకెళ్లారు.

ఈ వీడియోని ఐపిఎస్ అధికారి దీపాన్షు కబ్రా ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. అక్కాచెల్లల ప్రేమకు నిదర్శనం అనే క్యాప్షన్ తో పంచుకున్నారు. ఇప్పటిక వరకు ఈ వీడియోకి 2 వేలకు పైగా లైకులు వచ్చాయి. 4 వందల మంది కంటే రీట్వీట్లు చేశారు.